నల్లేరు మొక్కను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నల్లేరు మొక్కను ఉపయోగించి మనం శ్వాస రోగాలను, కఫ రోగాలను ఇంకా అలాగే చర్మ రోగాలను ఈజీగా దూరం చేసుకోవచ్చు.నల్లేరు మొక్క గుజ్జుకు సమానంగా మినపప్పును కలిపి మెత్తగా రుబ్బుకొని ఈ మిశ్రమాన్ని వడియాలుగా పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడియాలను రెండు పూటలా నిప్పులపై కాల్చుకుని తినడం వల్ల అన్ని రకాల వాత రోగాలు చాలా ఈజీగా తొలగిపోతాయి. నల్లేరును ఉపయోగించి మనం  ఎక్కిళ్లను కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. నల్లేరు కాడలను తీసుకొని వాటిని పొయ్యిలో వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ తరువాత దీనిని దంచి రసాన్ని తీయాలి. తరువాత ఈ  రసాన్ని అర చెంచా మోతాదులో తీసుకుని దానికి ఒక చెంచా తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా రెండు పూటలా తీసుకోవడం వల్ల  ఎక్కిళ్లు చాలా ఈజీగా తగ్గిపోతాయి.


నల్లేరు గుజ్జుతో పచ్చడి లేదా కూర చేసుకుని తినడం వల్ల తొడలను స్థంభింపజేసే ఊరు స్తంభ వాత రోగం సులభంగా తగ్గు ముఖం పడుతుంది. నల్లేరును ముక్కలుగా చేసి ఎండబెట్టి పొడిగా చేసుకోని ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గు చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా నల్లేరు కాడలతో ఉప్పు, చింతపండుకారం కలిపి పచ్చడిగా చేసుకోని ఈ పచ్చడిని అన్నంతో తినడం వల్ల మలబద్దకం సమస్య సులభంగా తగ్గుతుంది. విరిగిన ఎముకలను అతికేలా చేయడంలో నల్లేరును మించిన ఔషధం లేదని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.నల్లేరును ఉడికించి రసాన్ని తీసి ఈ రసానికి సమానంగా ఆవునెయ్యిని కలిపినెయ్యి మిగిలే దాకా వేడి చేయాలి.ఇలా తయారు చేసుకున్న నెయ్యిని రెండు పూటలా రెండు టీ స్పూన్ల మోతాదులో ఒక కప్పు గోరు వెచ్చని ఆవు పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల విరిగిన ఎముకలు చాలా త్వరగా అతుక్కుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: