రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. మన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం ద్వారా ఆ స్థానం లో నీరు చేరుతుంది. దీంతో కాళ్ళు తిమ్మిర్లు రావడం, బరువు ఎక్కడం, కళ్ళు తిరగడం, వంటి సమస్యలు తలెత్తుతాయి. మన శరీరంలో ఐరన్ పోలిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ బి 12 వీటిలో దేని పరిమాణం తగ్గిన కూడా అది రక్తహీనతకు దారితీస్తుంది.

 ఐరన్ లోపం వల్ల ఆ రక్తహీనత ఏర్పడుతుంది. అయితే మందుల ద్వారా కాకుండా ఆహారం ద్వారా రక్తహీనత రాకుండా మరియు రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం....!!

1) డ్రై ఫ్రూట్స్ : ఇవి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. అందులో ఖర్జూరాలు మరియు ఆఫ్రికార్డులు వంటి వాటిలో ఐరన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

2) మాంసం: రక్తంలోని హిమోగ్లోబిన్ వేగంగా పెరగడానికి ప్రోటీన్స్ చాలా అవసరం. ఎరుపు రంగులో ఉండే మాంసం ఇందుకు చాలా ఉపయోగపడుతుంది.

3) పండ్లు: నిమ్మ, నారింజ,మామిడి వంటి అన్ని పళ్ళల్లోనూ కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

4) ఆకుకూరలు: తోటకూర గోంగూర పాలకూర లాంటి ఆకుకూరలు హిమోగ్లోబిన్ పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

5)సముద్రపు ఆహార ఉత్పత్తులు : వీటిలో హిమోగ్లోబిన్ స్థాపించి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కావున సముద్రపు చేపలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

6) కూరగాయలు: తాజా కూరగాయలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మినరల్స్ కూడా ఉంటాయి.

7) గుడ్లు: గుడ్లలోని ఐరన్ అధికంగా ఉంటుంది. పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున ప్రతిరోజు ఒక గుడ్డును తినడం మంచిది.

8) నట్స్: నట్స్ లో చాలా అధికంగా ఐరన్ ఉంటుంది. ముఖ్యంగా బాదంపప్పు రోజు  తినడం వల్ల ఆరు శాతం ఐరన్ ని మనకి అందజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: