
ఈ క్రమంలోనే ఇక ఎన్నో కంపెనీలలో ఈ ఐస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అటు జ్యూస్ సెంటర్లలో కూడా ఇదే ఐస్ వాడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే జ్యూస్ సెంటర్లకు వెళ్లిన కస్టమర్లు జ్యూస్ ఎంతో చల్లగా ఉండడంతో హాయిగా తాగేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం మరోసారి జ్యూస్ సెంటర్ల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడి పోతారు. ఎందుకంటే ఐస్ ని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూడవచ్చు. సాధారణంగా నీటిని చల్లబరిచేందుకు ఏసీ లోని టెక్నాలజీని కాస్త విస్తృత స్థాయిలో వినియోగిస్తారు.
పెద్ద పెద్ద గొట్టాల్లో ఆర్వో ప్యూరిఫైయర్ నీటిని నింపి చల్లబరుస్తారు. భారీ ఐస్ క్యూబ్స్ ని సిద్ధం చేస్తారు. వీటిని తయారు చేసే కార్మికులు చెప్పులు ధరించి ఉత్త చేతులతో ఐస్ ను తాకిన ప్రమాదం ఉండదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. అయితే నీటిలో ఏమైనా మలినాలు ఉంటే అవి నేలపాలు అవుతాయని చెబుతుంటారు. కానీ అస్సలు పద్ధతి మరోలా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఐస్ తయారయ్యే విధానాన్ని చూసి నెటిజన్స్ అందరు షాక్ అవుతున్నారు. ఏకంగా మలినాలతో కూడిన నీటిని ఐస్ తయారు చేసే బాక్స్ లో నింపి కాస్తయినా శుభ్రంగా లేకుండా ఐస్ ని తయారు చేస్తున్నారు ఇలాంటి ఐస్ వాడటం వల్ల ఎన్నో రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.