ప్రస్తుత జీవన శైలి కారణంగా ప్రతి ఇంట్లో కూడా మధుమేహం వ్యాధుగ్రస్తులు ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధుమేహం నివారణకు తినడం, తాగడంపై ఖచ్చితంగా తగిన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా స్వీట్లు, వేయించిన ఆహారాలకు ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలి.పసుపులోని కర్కుమిన్ సమ్మేళనం శరీరంలో యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. డయాబెటిక్ రోగులలో శారీరక మంటను తగ్గించడంలో పసుపు సహాయపడుతుంది. కాబట్టి ఈ పసుపును ఆహారంలో తప్పక తీసుకోవాలి.ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడానికి మెంతులు తినవచ్చు. నీళ్లలో నానబెట్టిన మెంతి గింజలు తింటే జీవక్రియ రేటు పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు మెంతికూర తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకరకాయ రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.చక్కెర స్థాయిలను నియంత్రించడంలో నేరేడు పండ్లు ఎంతో ఉపయోగపడతాయి.


వేసవిలో నేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తాయి. నేరేడు పండ్ల గింజలను ఎండబెట్టి పొడిచేసి రోజుకో స్పూన్‌ చొప్పున తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.టీ, కాఫీలలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క పొడిని వినియోగించాలి. దాల్చిన చెక్క తీపి రుచిని కలిగి ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. ఇలా చక్కని పోషకాహారం తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్ పెరుగకుండా కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ గా ఉండాలంటే తీపి పదార్ధాలు తక్కువగా తినాలి. పొరపాటున చక్కెర తింటే షుగర్‌ లెవెల్స్‌ పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్‌లో ఇన్సులిన్ హార్మోన్ స్రావాన్ని సాధారణంగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు ఈ   ఆహారాలను రోజువారీ ఆహారంలో ఉంచుకోవాలి. ఇవి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: