ఈ మధ్యకాలంలో పిల్లలు ఎలా జంక్ ఫుడ్స్ విపరీతంగా తినేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే.  ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసిన సరే తిన్న పది నిమిషాలకు ఆకలి ఆకలి అంటూ జంక్ ఫుడ్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.  మరీ ముఖ్యంగా బయట దొరికే చిప్స్ - లేస్ రకరకాల ప్రాసెస్డ్ ఫుడ్ ని లైక్ చేస్తూ ఉంటారు పిల్లలు . కొన్ని కొన్ని సార్లు పిల్లలకు జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసే విషయంలో తల్లిదండ్రులు కూడా ఫ్లాప్ అవుతూ ఉంటారు . వారమంతా పిల్లల్ని జంక్ ఫుడ్ ఆపేసిన తల్లిదండ్రులు వీకెండ్ వచ్చిందంటే బయటకు తీసుకెళ్లి తల్లిదండ్రుల స్వయాన ఏదో ఒక ఫుడ్ కొనిపెడుతూ ఉండడం మనం చూస్తున్నాం.  మనలో చాలామంది కూడా మన పిల్లల విషయంలో ఇలానే తప్పులు చేస్తూ ఉంటాం.

అయితే  నెలకు ఒకసారి అలా తింటే పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు కానీ పదేపదే అలా తింటూ ఉంటే మాత్రం అది పిల్లలు ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది . మరీ ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా హార్ట్ ఎటాక్ లు వచ్చేస్తున్నాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్ లు పిల్లల్ని ఎలా చంపేస్తున్నాయో చూస్తున్నాం. స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . దానికి కారణం మెయిన్ ఫుడ్ అని అంటున్నారు డాక్టర్లు పట్టుమంటూ ఐదో క్లాస్ కూడా దాటని పిల్లలు భారీగా బరువు పెరిగిపోతున్నారు . జంక్ ఫుడ్స్ దానికి ప్రధాన కారణం అంటున్నారు. ఇంట్లో ఉంటే ప్రాసెస్ ఫుడ్ బయటకు వెళ్తే గోబీ మంచూరియా ..చిల్లి చికెన్ ..నూడిల్స్ ..పీజ్జా..బర్గర్  ఇలా రకరకాలుగా సాసెస్ వేసిన ఫుడ్స్ ని ఇష్టపడుతూ తింటూ ఉండడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు డాక్టర్లు.  

పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా ఎలా ఆపాలి?

పూర్తిగా పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా లేము . అది ఎవ్వరి వల్ల కాదు . కానీ జంక్ ఫుడ్ ఇచ్చే పద్ధతిని మాత్రం మార్చుకోవచ్చు.  అది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడల్లా జంక్ ఫుడ్ కొనివ్వకుండా దానికి ఆల్టర్నేట్గా ఇంట్లోనే ఏదైనా వాళ్ళకి నచ్చిన విధంగా పిండి పదార్థాలను చేసి పెట్టొచ్చు . అఫ్ కోర్స్ ఇప్పట్లో పిల్లలు పిండి పదార్థాలను లైక్ చేయడం లేదు . కానీ  ఆ పిండి పదార్థాలను తింటే దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది చక్కగా వివరిస్తూ వాళ్లకు పెట్టగలిగితే మాత్రం ఆ పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం హ్యాపీగా ఉంటుంది అంటున్నారు డాక్టర్లు . మరీ ముఖ్యంగా పల్లీ ఉండలు.. నువ్వులు ఉండలు ..కారపూస.. అరిసెలు..బొబ్బట్లు.. ఇలాంటివి ఈ కాలం పిల్లలు అస్సలు తినడం లేదు.

అంతేకాదు పిలల్లకి జంక్ ఫుడ్ అలవాటు చేసేది కూడా తల్లిదండ్రులేనని డాక్టర్లు కూసింత ఘాటుగానే జవాబు ఇస్తున్నారు.  పిల్లలు మారం చేసినప్పుడు కొంచెం ఓపిక చేసుకొని వాళ్ళు అడిగిన వాళ్లకి ఆరోగ్యకరమైన రుచికరమైన పిండి పదార్థాలు చేసి పెడితే మాత్రం కచ్చితంగా పిల్లలు జంక్ ఫుడ్ ని మానేస్తారు అంటున్నారు డాక్టర్లు. ఒక్కసారి పిల్లలకి నువ్వులు ఉండలు.. పల్లీ ఉండలు.. జంతికలు .. వాళ్లకి నచ్చే విధంగా చేసి పెట్టి చూడండి . ఆ తర్వాత మీరు తినమన్నా కూడా వాళ్ళ బయట జంక్ పుడ్ తినరు.  మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ ఎంత హెల్తీగా ఉంటాయో ఎంత టేస్టీగా ఉంటాయో అందరికీ తెలుసు.  నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ బిజీ బిజీ గా ఉంటున్నారు. ఇంట్లో చేసుకొని తినడం కన్నా బయట నుంచి ఈజీగా కొనుక్కొని తెచ్చుకొని తినడమే ఇష్టపడుతున్నారు జనాలు . తద్వారా ఫుడ్ ఐటమ్స్ ఏ కాదు బయట నుంచి రోగాలు కూడా కొని తెచ్చుకుంటున్నాం అన్న విషయం గుర్తుంచుకోవాలి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: