ప్రస్తుత కాలంలో మహిళల్లో పీసీఓడీ  మరియు పీసీఓఎస్  సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందులోనూ, టీనేజ్ అమ్మాయిలు మరియు గర్భం దాల్చడానికి ప్రయత్నించే మహిళలు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తాజా సర్వేలు చెబుతున్నట్లుగా, వందలలో 80 శాతం మంది మహిళలకు ఈ సమస్యలు ఏదో ఒక స్థాయిలో కనిపిస్తున్నాయి.


ప్రధాన కారణాలు:

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్యలు ఎక్కువగా జీవనశైలి మరియు అలవాట్లు కారణంగానే వస్తున్నాయి. రోజువారీ జీవితంలో స్ట్రెస్, వర్క్ లైఫ్ – ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం. సరైన శారీరక వ్యాయామం లేకపోవడం. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు – ముఖ్యంగా జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, చైనీస్ ఫుడ్, అధికంగా ఆయిల్ ఫుడ్, స్వీట్స్ తీసుకోవడం. ఇలాంటి అంశాల వల్ల పీసీఓడీ / పీసీఓఎస్ సమస్యలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.

ఎందుకు ఎక్కువ ఖర్చు పెడుతున్నా రిజల్ట్ రాదు?

చాలామంది మహిళలు ఈ సమస్యల కోసం గైనకాలజిస్ట్‌లను పలుమార్లు సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కొంతమందికి సరైన రిజల్ట్ రావడం లేదు. దీని వెనుక అసలు కారణం, లైఫ్ స్టైల్ మార్చకుండా కేవలం మందులపై ఆధారపడటం. డాక్టర్ల ప్రకారం, జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేస్తే, టాబ్లెట్లు వాడకుండానే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?

*ఉదయాన్నే లేవగానే – టీ లేదా కాఫీ తాగే అలవాటు మానేయాలి. ఇవి హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

* దాని బదులు గోరువెచ్చని నీళ్లు లేదా డీటాక్స్ డ్రింక్ తాగడం మంచిది.

ఆహారం :

*హెల్దీ, నేచురల్ ఫుడ్ తీసుకోవాలి.

*చైనీస్ ఐటమ్స్, బేకరీ ప్రొడక్ట్స్, అధికంగా ఆయిల్ & స్వీట్స్ పూర్తిగా మానేయాలి.

*ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ డైట్‌లో ఉండాలి.

వ్యాయామం :

*రోజుకు కనీసం అరగంట అయినా వ్యాయామం చేయాలి.

*జిమ్ చేయలేని వారు అయినా వాకింగ్ లేదా యోగా లాంటివి తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.

*బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అవసరం.

మానసిక ప్రశాంతత :

*అధిక ప్రెషర్, టెన్షన్ వీలైనంత వరకు తగ్గించాలి.

*మెడిటేషన్, యోగా, ప్రాణాయామం వంటివి మైండ్‌ని ప్రశాంతంగా ఉంచుతాయి.

మార్పులు చేస్తే లాభం ఏమిటి?

ఈ చిన్న మార్పులు అలవాటు చేసుకుంటే:

*హార్మోన్ల ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది.

*పీరియద్శ్ రెగ్యులర్ అవుతుంది.

*గర్భధారణకు అవసరమైన హార్మోన్ల స్థాయి సరిగా ఉంటుంది.

*బరువు క్రమంగా తగ్గుతుంది.

*డయాబెటిస్, హార్మోన్ సంబంధిత మరికొన్ని సమస్యల ప్రమాదం తగ్గుతుంది.



పీసీఓడీ / పీసీఓఎస్ అనేవి సాధారణ సమస్యలే అయినా, వాటిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలకు దారితీస్తాయి. మందుల కంటే ఎక్కువగా జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారానే ఈ సమస్యపై శాశ్వత పరిష్కారం పొందవచ్చు.

 నోట్ : ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం కొంతమంది నిపుణులు చెప్పిన వివరాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఆరోగ్యానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి అని పాటకులు గుర్తుంచుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: