గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 2వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ప్ర‌ముఖుల జననాలు


1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితుడు.
1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013)
1936: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989)
1942: బాడిగ రామకృష్ణ, 14 వ లోక్‌సభ సభ్యుడు.
1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, రచయిత, సాహితీవేత్త. (మ.2005)
1956: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు (మ. 2018).తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించాడు. రామారావు తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమయంలో హరికృష్ణ తండ్రి ప్రయాణించిన చైతన్య రథం వాహన సారథ్య బాధ్యతలు వహించాడు. ఇతని కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్.టి.ఆర్ ఇద్దరూ తెలుగు నటులే. హరికృష్ణ ఆగస్టు 29, 2018న నల్గొండ జిల్లా, అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
1965: సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్
1968: జీవిత, నటి, రాజకీయ నాయకురాలు.
1971: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.

ప్ర‌ముఖుల మరణాలు


1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు (జ.1892).
1992: బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902).
2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949). అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశాడు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించాడు.


పండుగలు , జాతీయ దినాలు

కొబ్బరి కాయల దినోత్సవం.


మరింత సమాచారం తెలుసుకోండి: