
ముఖ్య సంఘటనలు..
1989: మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
2008: టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.
ప్రముఖుల జననాలు..
1706: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని, రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు (మ.1790). ఆయన బహుకళాప్రావీణ్యుడు, ఈయన ఓ గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి. ఈయన కనిపెట్టిన వాటిలో "ఛత్వారపు కళ్ళద్దాలు", "ఓడొమీటర్ (ప్రయాణించిన దూరాన్ని సూచించేది)" మొదలగునవి చాలనే ఉన్నాయి. ప్రాంక్లిన్ "మొదటి అమెరికన్" అనే బిరుదుని కూడా పొందాడు.పిడుగులు పడి ఎన్నో విలువైన కట్టడాలు కూలిపోతూ ఉండేవి. ఈ పిడుగుల బారి నుండి కట్టడాలను కాపాడటం కోసం "లైట్నింగ్ కండక్టర్" లను తొలిసారిగా రూపొందించాడు. ఫ్రాంక్లిన్ 1752లో మొదలైన ఈ కడక్టర్ లను "ఫ్రాంక్లిన్ రాడ్" లు అని కూడా పిలుస్తారు.
1911: జార్జ్ స్టిగ్లర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1917: ఎం.జి.రామచంద్రన్, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)
1908: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
1942: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు. (మ.2016)
1945: మడిపల్లి భద్రయ్య, తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.
ప్రముఖుల మరణాలు..
2006: శాంతకుమారి, పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది. పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు, మంగళంపల్లి బాలమురళికృష్ణపాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు. (జ.1920)
2008: బాబీ ఫిషర్, చదరంగం క్రీడాకారుడు. (జ.1943)
2010: జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914)
2016: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)