నవంబర్ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవము. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాయి. నేడు గర్వాల్ రైఫిల్ దినం కూడా.


ఇక నవంబర్ 1 చాల  సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1952 లో నవంబర్ 1 న అమెరికాచే మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది. 1956  లో  బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబర్ 1 వరకు). 1956 లో  ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది. 1956 లో  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.


1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 1959 లో  ఆంధ్ర ప్రదేశ్‌ లో పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. 1966 లో  పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1973  లో  మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్‌ దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు. 1983 లో  ఆంధ్ర ప్రదేశ్లో లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు. 2000 లో  చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.


ఇక  నవంబర్ 1 నా చాల మంది ప్రముఖులు కూడా జన్మించడం జరిగింది. 1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ప్రసిద్ధ తెలుగు కవి. 1915: వట్టికోట ఆళ్వారుస్వామి, ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. 1919: అంట్యాకుల పైడిరాజు, ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. 1944: తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. 1945 లో  భారతీయ హేతువాది మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత నరేంద్ర దభోల్కర్. 1972 లో   పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు. 1973 లో  ఐశ్వర్యా రాయ్, అందాల తార, ప్రముఖ నటి, 1974lo   వి.వి.యెస్.లక్ష్మణ్ జన్మదినం. 1987 లో తెలుగు సినిమా నటీమణి ఇలియానా జననం.
.


మరింత సమాచారం తెలుసుకోండి: