
గిన్నెలు మాడిపోతే కొన్ని నీళ్ళు పోసి అందులో నిమ్మరసం లేదా నిమ్మ చెక్క వేసి కొద్దిసేపు మరిగిస్తే గిన్నెలకు అంటుకున్న మాడు తొందరగా వదిలిపోతుంది.
ఒకవేళ గిన్నెలకు జిడ్డు గనక అనుకున్నట్లయితే.. కొద్దిగా మజ్జిగతో రుద్ది కడిగితే జిడ్డు తొలగిపోతుంది..
పింగాణి పాత్రలు మిలమిల మెరవాలంటే మొదటగా బూడిద తో తోమి తర్వాత సబ్బుతో ఆ తర్వాత మంచి నీటితో కడగాలి.. మీరు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు పులుసు లో కానీ చారులో కానీ ఉప్పు ఎక్కువ అయినట్లయితే ఆ వంటకం లో ఇనుప గరిటె పెడితే ఉప్పదనం వెంటనే తగ్గిపోతుంది.
స్టీల్ పాత్రలు మెరవాలంటే మిగిలిపోయిన కూరలు లేదా చారుతో తోమితే బాగా మెరుస్తాయి.
వెండి పాత్రలు మెరుపు తగ్గిపోకుండా ఉండాలి అంటే.. ఈ పాత్రలను భద్రపరిచే బ్యాగులు కొంచెం కర్పూరం వేస్తే వెండి పాత్రలు మెరుపు తగ్గిపోకుండా ఉంటాయి.
ముఖ్యంగా స్టీల్ పాత్రలు బాగా మెరవాలి అంటే కొంచెం బేకింగ్ సోడాతో శుభ్రం చేస్తే బాగా మెరుస్తూ ఉంటాయి..
ఒక బంగారు వస్తువులు మెరవాలి అంటే ఉడికించిన బంగాళాదుంపలు నీటిలో కలిపి శుభ్రం చేస్తే మెరుస్తూ ఉంటాయి.
కప్పులో టీ, కాఫీ మరకలు ఉన్నట్లయితే ఉప్పు తో రుద్దడం మంచిది.
ఇత్తడి ,రాగి సామానులు చింతపండు లేదా ఉప్పు తో తోమడం వల్ల అవి మెరుస్తూ ఉంటాయి.