
1). పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరాకృతి కూడా మెరుగుపరుస్తుంది. ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో ఉండే కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
2). పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల శరీర వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. ఇది మన శరీరంలో ఉండే హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇక మూత్రపిండాలలో ఉండే రాళ్లను కూడా తొలగించడం జరుగుతుంది.
3). కంటి చూపును పెంచడంలో ఉసిరి రసం చాలా మేలు చేస్తుంది. ఇందులో కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. కనుక కంటిచూపును మెరుగుపరుస్తుంది. రోజు ఉసిరి రసాన్ని తాగడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. కంటిలోపల ఉండే శుక్లం, చికాకు, కళ్లల్లో తేమ వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
4). పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఉసిరిరసం ఉదయం పూట తాగడం వల్ల ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఫిట్ గా ఉండేలా చేస్తుంది.