
ఒక పెగ్గు లోపలికి వెల్లింది అంతే చాలు ఏదో స్వర్గంలో తేలుతున్నట్టు గా ఫీల్ అవుతూ ఉంటారు. మద్యం తాగే అలవాటు అందరికీ ఉంటుంది కానీ ఇక మద్యం తాగే సమయంలో చేసే కొన్ని విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. సాధారణంగా మద్యం తాగే ముందు ప్రతి ఒక్కరు కూడా చీర్స్ కొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అసలు మందు తాగే టప్పుడు చీర్స్ ఎందుకు కొడతారు.. ఈ పదం ఎలా వచ్చింది తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.
చీర్స్ అనే పదం పాత ఫ్రెంచ్ పదం కావడం గమనార్హం. చియర్ నుంచి ఈ పదం వచ్చింది. 18వ శతాబ్దం వరకూ చియర్ అనే పదాన్ని ఆనందం కోసం వాడే వారు. ఉత్సాహాన్ని వర్ణించే పదంగా దీనిని చూస్తారు. మందు తాగే ముందు అందరూ ఛీర్స్ అని ఉత్సాహంగా చెబుతుంటారు. దీని అర్థం జాయ్ ఫుల్ గా ఉండటం అని. దీని వెనుక ఇంకో అర్థం కూడా ఉంది. చీర్స్ చెప్పేటప్పుడు గ్లాసులను ఓకే దగ్గరకు రావడంతో అందులో నుంచి ఒక్కోచుక్క కింద పడుతుంది. ఇలా ఏవైనా ఆత్మలు ఉంటే వాటిని మొక్కడానికి కూడా చీర్స్ ఉపయోగపడుతుందని కొంత మంది చెబుతుంటారు. అంతేకాదు గ్లాసుల శబ్దం వినగానే అక్కడ ఏదైనా దుష్ట శక్తి ఉంటే వెళ్ళిపోతుందని మరికొంతమంది విశ్వసిస్తారు. అంతేకాదు కళ్ళతో మందులు చూస్తాం చేతితో తాగుతాం ముక్కుతో వాసన చూస్తాం అందుకే చెవులకు వినిపించడానికి చీర్స్ అని గ్లాసుల శబ్దం చేస్తారని మరికొంతమంది అంటారు.