
ఈ సీజన్లో దొరికే రేగుపండ్లను తినడం వల్ల ఇందులో ఉండే మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా బాగా సహాయపడతాయి. అంతేకాక రక్తహీనతతో బాధపడేవారికి హిమోగ్లోబిన్ పెరగడానికి కావాల్సిన ఐరన్ కంటెంట్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహాయపడుతుంది. పండిన రేగుపండ్లలో కాల్షియం, పాస్పరస్ అధికంగా ఉంటాయి.ఇవి ఎముకలు దృఢంగా తయారవడానికి సహాయపడతాయి. అంతేకాక ఆర్థరైటిస్ సమస్యలు తగ్గుతాయి.కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ పండ్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రేగిపండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా సహాయపడతాయి.ఇవి చర్మసమస్యలను తొలగించి యవ్వనంగా ఉండేలా చేస్తాయి. చర్మం ముడతలను తగ్గిస్తాయి.జీర్ణ సంబంధిత సమస్యలకు రేగిపండు తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగు పండు మంచి డైట్ అనీ చెప్పవచ్చు.ఇందులో ఉండే లో కెలరీలు వల్ల ఎన్ని తిన్న బరువు పెరగరు చాలా తక్కువ. శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరానికి అవసరమైన 24 రకాల ఆమైనో ఆమ్లాలలో 18 రకాలు ఈ పండులోనే లభిస్తాయని ఆరోగ్యానిపుణులు చెబుతారు. వీటిని తినడం వల్ల గ్యాస్ , ఆజీర్తి, త్రోట్ పెయిన్ , అలర్జీ, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాక వీటిలో వున్న పులుపు వల్ల గర్భిణుల్లో కలిగే వికారాలను వాంతులు, తగ్గుతాయి.మూత్రపిండాలు పనితీరు మెరుగుపడుతుంది.ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే కఫంను తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ కాలంలో దొరికె పండ్లను ఆ కాలంలో తినడం అందరికి మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు.