ఈ చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రతి ఒక్కరు దగ్గు జలుబు బారిన పడుతూనే ఉంటారు. తరచూ ముక్కు దిబ్బడ,దగ్గు, ఊపిరి ఆడక పోవడం అంటే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు . కానీ ఇవన్నీ పగలు వస్తే ఎంత సమస్యగా అనిపించదు కానీ, రాత్రి నిద్రించే సమయంలో చాలామంది ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. అలాంటి వారికి, నిద్రలేమితో పాటు, గుండెల్లో మంట, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటువుంటారు.రాత్రిపూట వచ్చే దగ్గును ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

 రాత్రిపూట ఎక్కువగా దగ్గు వచ్చేవారు, దానిని తగ్గించుకోవడానికి రాత్రి సమయంలో కొద్ది రోజులు భోజనానికి బదులుగా, గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగడం ఉత్తమం.మరియు ఉదయం ఒక లీటర్ చొప్పున వేడినీటిని త్రాగటం వల్ల గొంతులోని కఫాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.ఈ సమయంలో ఒక్క పూట ఆహారం చాలా మంచిది.కారణం పొట్ట ప్రేగులు శుభ్రం అయి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రోగనిరోధకశక్తి వైరస్ తో పోరాడి,వాటిని తగ్గిస్తుంది.

పిప్పరమెంట్ అయిల్..
ఈ పిప్పరమెంట్ అయిల్ ని ఒక వేలుతో కొద్దిగా తీసుకొని గొంతు, మరియు ముక్కు లోపల కొద్దిగా రాయాలి.దీనిని పుదీనా ఆకుల నుండి తయారవుతుంది. ఇది కొద్దిగా మంటనిస్తుంది, కావున కొద్దిగా రాసుకోవడం మంచిది.పుదీనా లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, దగ్గును కలిగించే జెర్మ్స్ తో పోరాడి,దగ్గును తగ్గించడానికి ఉపయోగపడతాయి.

 యుకలిప్టస్ అయిల్..
పొడిదగ్గుతో ఎక్కువగా బాధపడేవారికి,ఈ ఆయిల్ ని వాడటం వల్ల తొందరగా ఉపశమనం కలుగుతుంది. రాత్రిపూట వచ్చే దగ్గును  తగ్గించుకోవడానికి, సాయంత్రం పూట ఒక గిన్నెలో రెండు లేదా మూడు లీటర్ల నీటిని తీసుకొని,బాగా మరిగించాలి. ఇందులో రెండు,మూడు చుక్కల యుకలిప్టస్ అయిల్ వేసి ఆవిరి పట్టుకుంటూ ఉండాలి. ఇలా రోజూ చేయడం వల్ల రాత్రిపూట వచ్చే దగ్గును తగ్గించడమే కాక, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే జలుబు, కఫం, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: