రక్తదానం: ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ?

రక్తదానం చెయ్యడం ఆరోగ్యానికి చాలా మంచిది. రక్త దానం చేయడం ఓ మనిషికి జీవనదానం చేయడం. మనం ఒక మనిషి ప్రాణానే నిలబెడుతుంది.ఇంకా రక్తదానం అనేది మన శరీరానికి ఎలాంటి హాని కలిగించదు. అయితే ఈ విషయం చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అధిక శాతం మంది రక్తదానం విషయంలో చాలా భయాలతో ఇంకా చాలా అనుమానలతో ఉంటారు. కానీ రక్తదానం మనకు చాలా విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక ఈ క్రమంలో రక్తదానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.రక్తదానం వల్ల రక్తంలోని ఐరన్‌ స్థాయి చాలా ఈజీగా అదుపులో ఉంటుంది. దాని ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.ఇంకా అలాగే మీ శరీరంలో ఐరన్‌ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలేయ వైఫల్యం చెందడానికి కూడా దారితీస్తుంది. అలాగే ప్యాంక్రియాస్‌కు హాని కలిగించే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. 


అయితే రక్తదానం చేయడం వలన ఐరన్‌ స్థాయిలు చాలా ఈజీగా అదుపులో ఉంటాయి. రక్తంలో ఐరన్‌ సమాన స్థాయిలో ఉండడం వల్ల కాలేయం ఇంకా ప్యాంక్రియాస్‌ దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది. రక్తదానం చెయ్యడం వల్ల.. కాలేయం దెబ్బతినకుండా కాపాడుకోవడంతో పాటు దాని పనితీరులో కూడా మెరుగదలను  పొందవచ్చు.ఇక రక్తదానం చేయడం వల్ల.. కొత్త రక్త కణాల ఉత్పత్తి కూడా జరుగుతుంది.ఇంకా కొత్త రక్తం కూడా పుడుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రక్త కణాలు ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందువల్ల సంవత్సరంలో ఒక్కసారైనా.. రక్తాన్ని ఇవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది.అలాగే రక్తదానం చేయడం వల్ల.. పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు ఇంకా అలాగే ఊపిరితిత్తులు క్యాన్సర్‌తో బాధపడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: