సాధారణంగా అందరికి ఒకే విధమైన మెదడు కణాలు ఉంటాయి. కానీ కొంతమంది పిల్లల్లో ఎంత చదివిన గుర్తుండకపోవడం, ఎక్కడైన వస్తువులు పెట్టి మర్చిపోవడం, వంటివి జరుగుతుంటాయి. దానికి కారణం మెదడు కణాలు, నాడీ కణాలు సరిగా పని చేయకపోవడమే.మెదడు, నాడికణాలు సక్రమంగా పని చేయకపోతే మెదడు పంపించే సంకేతాలను నాడీ కణాలు ఇతర అవయవాలకు చేరవేయలేవు. మరియు అవయవాల నుంచి వచ్చే సంకెతాలు మెదడుకు చేరవేయలేవు.దీనితో సమంజసమైన నిర్ణయాలను తొందరగా తీసుకోలేరు. కావున మెదడు నాడీ కణాలు సక్రమంగా పనిచేయడానికి, ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఆహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యంగా ఉలవలు చాలా బాగా సహాయపడతాయి. ఉలవలు మెదడు కణాలను ఎలా సక్రమంగా పనిచేసేలా చేస్తాయి ఇప్పుడు చూద్దాం..

మెదడు కణాలు డీటాక్సిఫీకెషన్ కి ఉలవలు చాలా బాగా సహాయపడతాయి. మెదడు కణాలు పైన కానీ నరాల కణాల పైన కానీ హాని కలిగించే కెమికల్స్ ప్రోటీన్స్ పేరుకుపోతూంటాయి.అవే చా అనే ప్రోటీన్ బీటా ఎంబ్రాయిన్ అనే ప్రోటీన్స్ మెదడు కణాలపై పేరుకుని పోయి అవి కూచించుకు పోయేలాగా చేస్తాయి.అలా కుంచించుకుపోయిన నాడులను ఉలవల్లోని పాస్పరస్ తిరిగి వాటి రూపం దాల్చేందుకు ఉపయోగపడతాయి.

ఉలవలు తీసుకునే విధానం..
ఉలవలను పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. కావున వారికి రకరకాలుగా చేసి స్నాక్ రూపంలో పెట్టాలి. వీటిని 6,7గంటలు బాగా నానబెట్టి, కుక్కర్ లో వేసి ఉడకబెట్టాలి.అవి ఊడికిన తర్వాత గుగ్గిళ్లను చాట్ రూపంలో ఇవ్వవచ్చు. లేదా స్వీట్ ఇష్టపడేవారికి ఆ గుగ్గిళ్లను మీక్సీ జార్ లో వేసి,తగినంత బెల్లం వేసి మెత్తగా మీక్సీ పట్టి, పిల్లలకు ఇవ్వవచ్చు. అంతే కాక వీటిని తరుచూ తీసుకోవడం వల్ల ఇందులోని పైబర్ గుణాల వల్ల అధిక బరువుతో బాధపడేవారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.అస్తమా కలిగిన వారు వీటిని ఉడకబెట్టి, దానితో రసం చేసుకొని తరుచు తీసుకోవడం వల్ల, ఊపిరితిత్తుల్లోని నీరు వెళ్ళిపోయి, అస్తమాకు ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: