మనలో కొంతమందికి వారు పడుకున్న వెంటనే నిముషం ఆలస్యం లేకుండా వెంటనే నిద్రలోకి జారుకుంటారు.కానీ ఇంకొంతమందికి మాత్రం నిద్ర వచిన్నట్టు వున్నా పడుకుంటే మాత్రం అస్సలు నిద్ర పట్టదు.ఒక్కోసారి నిద్రపోకుండానే రాత్రిలు గడిపే వారుంటారు.మన పక్కన ఎవరైనా నిద్రపోతుంటే కూడా అదో కోపం వస్తుంటుంది. అలా నిద్ర రాకపోవడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు.మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లు,జీవన విధానం,ఆలోచనా తీరుపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇది ఇలాగే కొనసాగితే స్లీపింగ్ డిజార్డర్ వచ్చి క్రమక్రమంగా నిద్ర అనేది రాకుండా ఉంటుంది.దానికోసం మరి నిద్ర టాబ్లెట్లు వాడి,నిద్ర తెప్పించుకోవాల్సి ఉంటుంది.కావున ఒక వేళ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకున్నా నిద్ర పట్టడం లేదంటే కచ్చితంగా కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలెంటో తెలుసుకుందాం పదండీ..

సరైన ఆహారం తీసుకోవడం..

నిద్రకు పక్కకు ఉపక్రమించే ముందు అతిగా మసాలాలు తినడం వల్ల కూడా గ్యాస్ ఫామ్ సరైన నిద్ర పట్టకుండా ఉంటుంది.అంతేకాక దీనివల్ల కడుపులో మంట గుండె మంట కలుగుతూ ఉంటాయి.దీనివల్ల నిద్రకు భంగం కలుగు అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిద్ర ఉపక్రమించే ముందు సాఫీగా జీర్ణమయ్యే ఆహారాలనే తీసుకోవాలి.

గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉండడం:

చాలామంది నిద్ర పోవాలి అని తెలిసినా కూడా అర్థరాత్రులు అయ్యే వరకు స్క్రీనింగ్ చూస్తూ,నిద్ర వచ్చినా అపుకుంటూ వుంటారు.దీనితో క్రమంగా మన మెదడులో నిద్ర హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వక నిద్ర సమస్యలు వస్తాయి.కావున టీవీ,ల్యాప్ ట్యాప్స్,ఫోన్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

అనవసరమైన ఆలోచనలకూ దూరంగా ఉండాలి:

ఈ మధ్యకాలంలో చాలామందికి బెడ్ మీదకు రాగానే ఎక్కడలేని పనులు అన్నీ గుర్తుకు వచ్చేస్తాయి.మరియు వారు పడిన అవమానాలు,బాధలు,అప్పులు అన్నీ గుర్తు చేసుకుంటూ వుంటారు. వాటితో నిద్ర అనేది తొందరగా రాదు.కావున వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండేందుకు ట్రై చేయండి. మీ మూడ్ ని డైవర్ట్ చేసుకోవడానికి ఏదైనా పుస్తకం చదవడం, ధ్యానం చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి.

కావున మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే వెంటనే ఈ చిట్కాలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: