సాధారణంగా చాలామందికి వయసు పెరుగుతూ ఉండడంతోపాటు,వారి ఆహారపు అలవాట్లు,జీవనశైలి, సీజనల్ చేంజెస్ వల్ల వారి ముఖం మెరుపును కోల్పోతూ ఉంటుంది.క్రమంగా వారి ముఖం పై మృతకణాలు ఏర్పడడం,వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ ముఖం ముడతలు పడటం,చర్మం బ్రేకౌట్స్ కావడం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి.ఇలాంటి సమస్యలు కలవారు ఎలాంటి మేకప్ లు వేసుకున్న కూడా అంత అందంగా కనిపించరు.అలాంటివారు వేరే వారి ముఖం చాలా అందంగా ఉందని,వారి మొహం పేలగా ఉందని బాధపడుతూ ఉంటారు.అలాంటి వారి కోసం ఎర్ర కందిపప్పు చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఈ ఎర్ర కందిపప్పులో వున్న బిటా కెరొటీన్ అనే ప్రోటీన్ చర్మ సమస్యలను పోగొట్టి,చర్మం బిగుతుగా ఏర్పడడానికి ఉపయోగపడుతుంది.కావున మీరు కూడా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్యాక్ ట్రై చేయాల్సిందే.ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం పదండీ..

ఈ ప్యాక్ కోసం ముందుగా మూడు టేబుల్ స్ఫూన్ల ఎర్ర కందిపప్పు తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. మరునాడు ఉదయాన్నే నానబెట్టిన కందిపప్పు తీసుకొని అందులో ఒక స్ఫూన్ తేనే,మూడు స్ఫూన్ల పాలు వేసి బాగా మీక్సీ పట్టుకోవాలి.వచ్చిన ఈ మిశ్రమానికి ఒక స్పూన్ కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అప్లై చేయకముందే ముఖం బాగా శుభ్రంగా కడుక్కొని,ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి.దీనిని ఇలానే అరగంట నుంచి 45 నిమిషాల వరకు ఆరనిచ్చి,అది బాగా ఆరిన తర్వాత మెల్లగా మర్దన చేస్తూ శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేసుకోవడం వల్ల, ముఖం పై ఉన్న బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్,ముడతలు,మొటిమలు,మచ్చలు బ్రేకౌట్స్ ఉన్నా తొందరగా తొలగిపోయి ముఖం మెరుపును సంతరించుకుంటుంది.

జిడ్డు చర్మం కలవారు పాలకు బదులుగా పెరుగు కానీ,తేనే కానీ వేసుకోవడం ఉత్తమం.మరియు వీటన్నిటితో పాటు సరైన ఆహారం,సరైన జీవన విధానం, శరీరం డిహైడ్రేషన్ గురి కాకుండా తగిన నీటిని అందించడం వంటి పనుల వల్ల కూడా మొఖం అందంగా తయారవుతుంది.మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: