దోమలు కుట్టడం వల్ల ఎన్నో ఆరోగ్యకర సమస్యలు ఎదురవుతాయి. దోమలు కొట్టడం వల్ల జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. మలేరియా, డెంగ్యూ లాంటి ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. దోమ కొట్టడం వల్ల మనిషికి అనేక రోగాలు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జబ్బులు దోమలు కుట్టడం వల్ల వస్తాయి. అయితే, ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిన కుట్టవు. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవా మాత్రమే ఎక్కువగా కుడతాయట. సాధారణంగా మనుషుల రక్తంలో O పాజిటివ్, O నెగిటివ్, A పాజిటివ్, A నెగిటివ్, AB పాజిటివ్ అండ్ నెగిటివ్, B పాజిటివ్ అండ్ నెగటివ్ మొత్తం 8 రకాలుగా ఉంటాయి.

వాటిలో కొన్ని బ్లడ్ గ్రూప్లు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. వీటన్నిటిలో ఎక్కువగా O పాజిటివ్, నెగిటివ్ వ్యక్తులను మాత్రమే ఎక్కువగా కొడతాయని, అమెరికన్ జర్నల్  ఆఫ్ ఎంటమాలజీలో ప్రచురితమైన ఒక అధ్యాయం తెలిపింది. O బ్లడ్ గ్రూప్ అంటే దోమలకు చాలా ఇష్టం. దోమలు శరీరంలో నుంచి వచ్చే వాసన వాటికి రుచిగా అనిపిస్తుంది. ఆ తరువాత A బ్లడ్ గ్రూప్ వాళ్ళని కుడుతుంటాయి. మిగతా బ్లడ్ గ్రూప్ వాళ్లని ఎక్కువగా కుడతాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..

ఈ దోమల్లో కేవలం ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. అలాగని మనిషి రక్తమే వాటి ఆహారం కాదు. వాటి గుడ్ల కోసం మనుషుల రక్తాన్ని తాగుతాయి. మనిషి రక్తం వాటి గుడ్డకు వెచ్చదనాన్ని ఇస్తుంది. ఒక్కసారి సేకరించిన రక్తంతో ... ఆడ దోమ 200 నుంచి 300 వరకు గుడ్లను పెడుతుంది. ఇక, మగ దోమలు మాత్రం పువ్వుల నుంచి తేనెను, చెట్లు రసానాలను తాగటం చేస్తుంటాయి. ఈ దోమలు ఎక్కువగా కుట్టకూడదు. దోమల్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోమలు కుట్టడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: