
అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. క్యారెట్లు తినటం వల్ల చర్మం, జుట్టు, గుండె, కాలేయం, మూత్రపిండాలు ఇలా శరీరంలో ఉండే అన్ని భాగాలకు క్యారెట్ చాలా మేలు చేస్తుంది. క్యారెట్ ను మనం కూరలుగా, స్వీట్ కార్ తీసుకోవచ్చు. ప్రతిరోజు చిన్న క్యారెట్ ముక్క తిన్నా... ఉండే లాభాలు ఊహించనివి. దీర్ఘకాలిత వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, పొటాషియం, సోడియం, యంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, క్యాల్షియం, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్ లు లభిస్తాయి. క్యారెట్ లో ఉండే విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగితే చర్మం అందంగా, కాంతివంతంగా, ఫ్రెష్ గా కనిపిస్తుంది. క్యారెట్ లో ఉండే బీటా కెరోటీన్.. శరీరంలోని వెళ్లగానే విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్లు బాగా కనిపించేలా చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది.
ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్లు... జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలు రానివ్వకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రక్త పోటును బ్యాలెన్స్ చేయటంలో క్యారెట్ చక్కగా సహాయపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది క్యారెట్. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది. అధిక బరువును తగ్గించడంలో, శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించడంలో క్యారెట్ ఉపయోగపడుతుంది. విష పదార్థాలను, వ్యర్ధాలను బయటకు పంపించడంలో కూడా సహాయపడుతుంది. దంతాలు, గుళ్ళకు కూడా క్యారెట్ మేలు చేస్తుంది. జీవక్రియను మెరుగు పరుస్తుంది. డయాబెటిస్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఊపిరితిత్తులకు, లివర్కు రక్షణ కల్పిస్తుంది.