నేటితరం వారికి ఫుడ్ లో అనేక రకాల వెరైటీ ఆహారాలు దొరుకుతున్నాయి . దొరికిన ప్రతి దానితోనూ కొత్త కొత్త పదార్థం తయారు చేసి దాన్ని ఎంతో ఫేమస్ చేస్తున్నారు . ఇక ఒకప్పుడు సాధారణంగా చూసే వడలు ఇప్పుడు చాలా ఫేమస్ . పూర్వకాలంలో మన పెద్దలు వడలను ఇంట్లోనే తయారు చేసి పెట్టేవారు . కానీ ఇప్పటి తరం బయట రెస్టారెంట్లలో కావాలని మరీ ఆర్డర్ ఇచ్చుకుని ఈ వడలను టేస్ట్ చేస్తున్నారు . అటువంటి వాటిలో మొక్కజొన్న పెసరపప్పు వడలు కూడా ఒకటి .ఈ వడలు ఎంతో రుచికరంగా ఉంటాయి .

ఒక్కసారి తింటే వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు . దాని తయారీ విధానం కొందరికి మాత్రమే తెలుసు . తయారీ విధానం తెలిస్తే తప్పనిసరిగా పర్ఫెక్ట్ గా తయారు చేసుకోగలరు అని నమ్మకం మీలో ఉంటుంది . మరి ఇంకెందుకు ఆలస్యం మొక్కజొన్న పెసరపప్పు వడలు తయారీ విధానం చూద్దాం . ముందుగా కావాల్సిన పదార్థాలు ... మొక్కజొన్న విత్తనాలు ఒక కప్పు , పెసరపప్పు ఒక కప్పు , కొబ్బరి తురుము పావు కప్పు , చీర తురుము అర కప్పు , జీలకర్ర ఒక టీ స్పూన్ , నువ్వులు ఒక స్పూన్ , ఉప్పు తగినంత ,

 నూనె తగినంత , అల్లం పచ్చిమిర్చి తురుము రెండు స్పూన్ , కొత్తిమీర తరుగు రెండు స్పూన్లు . కావాల్సిన పదార్థాలు ఇవి . ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం . పెసరపప్పుని మూడు గంటలు నానబెట్టాలి . మొక్కజొన్న విత్తనాలను నానబెట్టాల్సిన అవసరం లేదు . వీటిని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి . పెసరపప్పుని మిక్సీ జార్ లో వేసి కొంచెం బరక మిక్సీ పట్టుకోవాలి . అనంతరం అందులో మొక్కజొన్న గింజలు , కొబ్బరి తురుము , కీర తురుము , జీలకర్ర ఒక స్పూన్ , నువ్వులు ఒక స్పూన్ , ఉప్పు మరియు పచ్చిమిర్చి , అల్లం , కొత్తిమీర నువ్వు వేసుకుని వడ వేసే విధంగా కలుపుకోవాలి . అనంతరం నూనె వేడెక్కాక వడలను ఒక్కొక్కటిగా ఫ్యాన్ లో వేయండి . ఆ తర్వాత టేస్టీ వడలను తినండి .

మరింత సమాచారం తెలుసుకోండి: