
నోటిలో బ్యాక్టీరియాను తగ్గించడానికి, శ్లేష్మం విప్పడానికి, వాపును తగ్గించడానికి ఉప్పు నీటిని రోజు పుక్కిలిస్తే మంచిది. ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగించి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం సులువుగా పొందవచ్చు. నోటిలో పుండ్లు లేదా పూతలతో బాధపడుతున్నట్లయితే, ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి.
తక్కువ సమయంలో గాయాలు నయం కావడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి బాగా కలిపి, పుక్కిలించి రెండు నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మేయాలి. రోజులో కనీసం రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం సమయంలో గోరువెచ్చని నీళ్లను పుక్కిలించడం వల్ల పంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధ పడేవాళ్ళు సైతం ఉప్పు నీళ్లతో పుక్కిలిస్తే మంచిది. శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సైతం ఈ నీళ్లు తోడ్పడతాయి. థైరాయిడ్, గొంతు సంబంధిత సమస్యలకు సైతం ఇది సంజీవనిలా పని చేస్తుంది. నోటి గాయాలకు చెక్ పెట్టడంలో నోటి నుంచి హానికర బ్యాక్తీరియాను తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. గోరువెచ్చని ఉప్పు నీటి వల్ల లాభమే తప్ప షరీరానికి ఎక్కువగా నష్టము అయితే లేదు.