
పిల్లలు - వృద్దులు కూడా తింటారు వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుందేమో అన్న మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా కల్తీ చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక కల్తీ ముఠాని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు . కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని మన్వి పట్టణంలో ఇస్లాం నగర్ లోని ఓ శిథిలావస్థలో ఉన్న ఇంటి సమీపంలో కల్తీ మసాలా ఆకుపదార్థాలు తయారు చేస్తున్నారు . దీనిపై పక్కా సమాచారం అందుకున్న ఆహార శాఖ అధికారులు దాడి చేయడంతో ఒకటి కాదు రెండు కాదు సుమారు 846 కిలోల కల్తీ మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు కొత్తిమీర గింజలు ..మిరప గింజలు.. బిర్యాని ఆకులు ..చికెన్ మసాలా ..సాంబార్ మసాలా.. ఇలా చాలా పౌడర్స్ లను రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్నారు. యూకలిప్టస్ చెట్టు ఆకులకు రంగు వేయడం ద్వారా బిర్యానీ ఆకులు తయారు చేస్తున్నారు . బొప్పాయి గింజలను మిరప గింజలతో కలిపి అమ్మేస్తున్నారు. బఠానీలతో ఆకుపచ్చ రంగును కలిపి వినియోగదారులను అవి మిల్లెట్ లని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు . అధికారులు దాడి చేస్తుండగా కల్తీ రాకెట్ నడుపుతున్న నిందితుడు గుప్పూర్ అతని సహచరులు పారిపోయారు . ఈ దాడిలో మొత్తం 846 కిలోల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటివి తింటే ఆరోగ్యం పాడైపోయి త్వరగానే చనిపోతారు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు . ప్రతి విషయంలో ఇలా కల్తీ చేసేస్తుంటే ఎలా బ్రతకాలి అంటూ కామన్ పీపుల్స్ కూడా బాధపడిపోతున్నారు..!!