
చిత్తూరు జిల్లా పీలేరు... ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గట్టి పట్టున్న నియోజకవర్గం. 2009లో కిరణ్ ఇదే స్థానం నుంచి గెలిచి, అనూహ్యంగా సీఎం అయిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన జరిగాక కిరణ్ కుమార్, కాంగ్రెస్‌ని వీడి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఘోరంగా విఫలమై, మళ్ళీ కాంగ్రెస్‌లోకే వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు.
అయితే ఈయన సోదరుడు kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో యాక్టివ్‌గా పనిచేసుకుంటున్నారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున పీలేరులో పోటీ చేసిన కిషోర్, వైఎస్సార్‌సీపీ నేత చింతల రామచంద్రారెడ్డి చేతిలో 15 వేల ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇక తర్వాత కిషోర్ టీడీపీలోకి వచ్చేశారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
కానీ అనూహ్యంగా నల్లారి 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో టీడీపీ నుంచి పీలేరులో పోటీ చేసి మళ్ళీ చింతల చేతిలో ఓడిపోయారు. ఇక వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో చింతల నియోజకవర్గంలో దూకుడుగా పనిచేసుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అటు ప్రభుత్వ పథకాలని బాగా ప్రచారం చేస్తూ, ప్రజలకు అందిస్తున్నారు. అయితే ఏడాది కాలంలో పీలేరులో జరిగిన అభివృద్ధి శూన్యం. ఏదో పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం తప్ప, మిగతా కార్యక్రమాలు ఏమి జరగడం లేదు.
అటు టీడీపీ నేత నల్లారి కిషోర్ సైలెంట్‌గా పనిచేసుకుంటూ...పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఇప్పటికీ పీలేరులో నల్లారికి బలమైన కేడర్ ఉంది. అటు టీడీపీ కేడర్ కూడా నల్లారికి ఫుల్ సపోర్ట్‌గా ఉంటుంది. ప్రస్తుతానికైతే పీలేరులో నల్లారి స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లోపు చింతల బలం ఏమైనా తగ్గితే నల్లారికి గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పొచ్చు.