
అయితే 2019 ఎన్నికల్లో అసలు సినిమా మొదలైంది. ఓ వైపు జగన్ గాలి, మరో వైపు వసంత కృష్ణప్రసాద్ రాజకీయం. ఈ దెబ్బకు ఉమాకు చుక్కలు కనిపించాయి. తొలిసారి ఉమాకు ఓటమి ఎదురైంది. ఇక వసంత ఎమ్మెల్యే అయ్యాక మరింతగా ఉమాకు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడకక్కడ ఉమాకు చెక్ పెడుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు బాగా ప్లస్ అవుతున్నాయి.
అలా అని ఉమా ఏమి సైలెంట్‌గా ఉండటం లేదు...వసంతపై తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు. అక్రమ మైనింగ్, ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ఆ మధ్య అక్రమ మైనింగ్‌ని పరిశీలించడానికి వెళ్ళి, అరెస్ట్ కూడా అయ్యారు. జైలు నుంచి వచ్చాక కూడా ఉమా దూకుడు కొనసాగుతూనే ఉంది. అయితే ఉమాని వసంత పుంజుకోకుండా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మైలవరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
మళ్ళీ ఉమాకు ప్రజా మద్ధతు పెరగకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల్లో ఉమాకు చెక్ పెట్టారు. తాజాగా ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో కూడా మైలవరంలో వైసీపీ సూపర్ విక్టరీ కొట్టేలా చేశారు. దాదాపు వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేలా చేశారు. దీంతో ఉమా...టిడిపిని ఏ మాత్రం పైకి లేపలేకపోయారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఉన్న రాజకీయ పరిస్తితుల్లో మైలవరంలో వసంతకు తిరుగులేదనే చెప్పొచ్చు. ఏదేమైనా వసంత...దేవినేని ఉమాని గట్టి దెబ్బ కొట్టినట్లే కనిపిస్తోంది.