కేంద్ర ప్రభుత్వం పేదల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కార్మికులకు ప్రయోజనాలను కల్పించే పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక అలాంటి పథకాలలో భాగంగానే ఈ- శ్రమ్ కార్డు పథకం కూడా ఒకటి. ఇకపోతే ఈ పథకం ప్రభుత్వ సహాయం లేదా బ్యాంకుల నుండి రుణాలు పొందడంలో సమస్య ఉన్న కార్మికుల కోసం ఉపయోగపడుతుంది. అంతేకాదు రోజువారి కూలీ పని చేసేవారు ఉపాధి కార్మికుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇకపోతే ఈ కార్డుదారులకు ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలను అందించడమే కాకుండా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుంది.

ఇక ఏదైనా కారణం వల్ల కార్మికుడు మృతి చెందితే అతని కుటుంబానికి రెండు లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ముఖ్యంగా కార్డుదారుడు ప్రమాదానికి గురై వికలాంగులు అయితే లక్ష రూపాయల సహాయం లభిస్తుంది. ఇకపోతే ఈ శ్రమ్ కార్డు పథకం కింద ప్రభుత్వం నమోదు చేసుకున్న కార్మికులకు ఉచిత కుట్టుమిషన్లు,  పిల్లలకు స్కాలర్షిప్లు , ఉచిత సైకిళ్ళు మొదలైనవి కూడా అందిస్తుంది. అంతేకాదు కార్మికులు ఇల్లు నిర్మించుకోవడానికి సులభంగా రుణం కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్న ఈ శ్రమ్ కార్డును ఉపయోగించి రుణం తీసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడింది .


ఇక ఇందుకోసం కావలసిన ధృవీకరణ పత్రాలు ఏమి అని అంటే.. ఆధార్ కార్డు , ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబరు , ఐఎఫ్ఎస్సి కోడ్ , బ్యాంక్ అకౌంట్ నెంబర్ , ఆదాయపు దృవీకరణ పత్రము,  చిరునామా పత్రము,  పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. e-shram / eshram.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: