ఈ మధ్యకాలంలో చిన్న పొదుపు పథకాలు అయినా పిపీఎఫ్ , సుకన్య సమృద్ధి యోజన, ఎన్ పీ ఎస్ లేదా కిసాన్ వికాస్ పత్ర మొదలైన వాటిలో కూడా పెట్టుబడి పెట్టినట్లయితే ఈ వార్త మీ కోసమే అని చెప్పాలి. నివేదికల ప్రకారం సెప్టెంబర్ ప్రైమాసిక మాసంలో సుకన్య సమృద్ధి యోజన పిపిఎఫ్ ఖాతాలపై వడ్డీరేట్లు మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇక రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణంతో వడ్డీ రేటు పెరుగుదల మధ్య బ్యాంకుల వడ్డీ రేటు మునుపటి కంటే ఈసారి ఎక్కువ వడ్డీని అందించవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ప్రభుత్వం పెంచిన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఇకపోతే రెపోరేటును ఆర్బిఐ మూడుసార్లు 1.4 శాతం వడ్డీ రేట్లు పెంచింది. ఇక వివిధ బ్యాంకులు, ఫిక్స్ డిపాజిట్ , ఆర్ డి వడ్డీ రేట్లు కూడా పెంచాయి.


ప్రస్తుతం పీ పీ ఎఫ్ పై సంవత్సరానికి 7.1% వడ్డీ అందుబాటులో ఉంది.  అదే సమయంలో సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే వారికి 7.6% సంవత్సర రాబడి కూడా ఇవ్వబడుతుంది. ఇక అంతేకాదు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతాలపై 5.8% రాబడిని కలిగి ఉంటుంది. ఇక కిసాన్ వికాస పత్ర పై వడ్డీ రేటు 6.9% గా ఉన్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఇలాంటి ప్రభుత్వ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకునే వారు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాదు దీర్ఘకాలంగా పెట్టుబడి పెడితే మీకు మంచి ఆదాయంతో పాటు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

నేషనల్ పెన్షన్ సిస్టం ఆర్థిక భరోసాను ఇస్తే.. సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. కాబట్టి ఈ పథకాలపై ఇన్వెస్ట్ చేస్తూ మంచి రాబడిని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: