పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు చేస్తూ మరో పక్క సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఆయన ఇప్పటికీ వకీల్ సాబ్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కూడా కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. హరిహర వీరమల్లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీకాక ఈ సినిమా నుంచి మొన్న రిలీజ్ చేసిన ఒక చిన్న పాటి వీడియో ఈ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో రిలీజ్ అయిన ఆ వీడియో ప్రకారం పవన్ వస్త్రధారణ కూడా అప్పటి కాలానికి తగ్గట్టే ఉంది.

 అయితే పవన్ కోసం ఈ సినిమా కోసం ఏకంగా 30 రకాల వస్త్రాలను సిద్ధం చేశామని ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న ఐశ్వర్య రాజీవ్ తెలిపారు.. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె హరిహర వీరమల్ల సినిమా ఒక పీరియడ్ డ్రామా కావడంతో ఈ సినిమాలో పవన్ గారు ధరించే బట్టలకు సంబంధించి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, మరీ ముఖ్యంగా కలర్ ప్యాటర్న్ అలాగే ఆయన వస్త్రాలకు వాడిన ఫ్యాబ్రిక్ వరకు చాలా శ్రద్ధ పెట్టి సిద్ధం చేయాల్సి వచ్చింది. 

ఇంత ఎందుకంటే సినిమాలో ప్రతి అంశం హైలెట్ అవ్వాలనే అంత శ్రద్ధ పెట్టామని ఆమె పేర్కొంది. అంతేకాక ఈ సినిమా కోసం వాడిన దాదాపు అన్ని కాస్ట్యూమ్స్ కూడా స్వయంగా చేతులతో కుట్టినవేనని అలాగే ఈ సినిమాలో పవన్ కాస్ట్యూమ్స్ కు వాడిన గుడ్డ సైతం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించామని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: