సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే.. వారు తీయబోయే సినిమాలకు సంబంధించిన టీజర్లను , ప్రేక్షకుల కోసం ముందుగానే విడుదల చేస్తూ ఉంటారు. దీని ద్వారానే సినిమా కి ఒక హైపు వస్తుంది. ఆ చిత్రం విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలలో నెలకొల్పిన రికార్డులను బట్టి, సినిమాపై అంచనాలు ఏర్పడతాయి. ఇక ఆ  చిత్రం విడుదలకు ముందు క్రియేట్ చేసిన రికార్డులను కూడా ఆ హీరో అభిమానులు సోషల్ నెట్ వర్క్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సినిమా విడుదల అయ్యాక టాక్ తో సంబంధం లేకుండా ఆ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ను నమోదవుతాయి. ఇదిలా వుండగా టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్లు ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి




1). రామరాజు ఫర్ భీమ్: రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో  'ఆర్ ఆర్ ఆర్'నుండి ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ గా వచ్చిన దీనికి ఏకంగా 50.27 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఏ టీజర్ కు రాని వ్యూస్ ఈ టీజర్ కు రావడం విశేషం.. అత్యధిక వ్యూస్ ను సాధించిన టీజర్ గా, నంబర్ వన్ స్థానంలో నిలిచింది.



2). పుష్ప: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'.ఈ చిత్రం నుండి టీజర్ ను ఇటీవల విడుదల చేయగా, దానికి రెస్పాన్స్ భారీగానే అందుకుంది. దీనికి ఏకంగా 47.38 మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది.


3). రామరాజు ఫర్ బీమ్ : రామ్ చరణ్ ,రాజమౌళి డైరెక్షన్ లో మల్టీస్టారర్ మూవీలో రామ్  నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా నుండి రామ్ చరణ్ ఇంట్రో టీజర్ గా వచ్చిన , దీనికి ఏకంగా 43.92 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి.





4). అఖండ: బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే అంచనాలకు మించి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వీరి కాంబినేషన్ లో  తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం అఖండ. ఈ చిత్రానికి కేవలం టైటిల్ మాత్రమే విడుదల చేయగా, దీనికి ఏకంగా 40.67 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి."సీనియర్ హీరోలలో బాలయ్య రికార్డును కూడా చెప్పుకోవచ్చు".



5). సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు ,అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం టీజర్ కు ఏకంగా 33.80 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి..














మరింత సమాచారం తెలుసుకోండి: