సినీ ఇండస్ట్రీలో ఇపుడు హాట్ టాపిక్ గా మారిన విషయం  ఏమిటంటే,  మా ఎలక్షన్ల గురించి మాత్రమే. ఈ  మధ్యకాలంలో అనేక మంది సెలబ్రెటీస్ తనదైన శైలిలో ఈ మా ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సీనియర్ నటుడు అలాగే టీడీపీ రాజకీయనేత అయిన మురళీమోహన్  మన టాలీవుడ్ హీరోలపై కామెంట్ చేశారు.అయితే ఆయన ఏమన్నారో , ఎందుకు అన్నారో  తెలుసుకుందాం.

ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) అధ్యక్ష పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసింది. ఇక ఇప్పుడు మా బరిలోకి ఏకంగా ఐదుగురు సెలబ్రిటీలు దిగిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇలా ఎన్నికలు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఏదైనా గొడవలు జరగవచ్చనే ఆలోచనతోనే కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఒకరిని ఎంచుకోవాలని,  ఒక ప్రత్యేక కమిటీని కూడా నిర్మించాలని అనుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మోహన్ బాబు , చిరంజీవి, జయసుధ వంటి పెద్దలు మా ఎలక్షన్ల పై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఇదే నిజమైతే ఏకగ్రీవంగా ఎవరినైనా ఎన్నుకున్నా  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే  ఎప్పుడు మా ఎలక్షన్లు జరిగినా, బాధ్యతగా వ్యవహరించిన దాసరినారాయణరావు ప్రస్తుతం మన మధ్య లేరు. ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన స్థానాన్ని చిరంజీవి గారు భర్తీ చేస్తున్నారు అంటూ తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కు లాంటి వారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే, సినీ ఇండస్ట్రీ లో పనిచేస్తున్న ఎంతో మంది కార్మికులకు అండగా నిలుస్తున్నారు. అంతేకాదు తను సంపాదించిన డబ్బులలో  కోట్ల రూపాయలను పేద ప్రజలకు ఉచితంగా వైద్య రూపంలో అందిస్తున్నారు. ఆయన చేసే సేవలు ఇంకెవరు చేయడం లేదని చెప్పవచ్చు. అంతేకాదు చిరంజీవికి మంచి అనుభవం కూడా ఉంది. ఆయన  రాజకీయ వేత్తగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి అన్ని బాధ్యతలు చక్కగా తెలుస్తాయి అని మురళీ మోహన్ తెలిపారు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న మా ఎలక్షన్ ల  వైపు కూడా చూడడం లేదు. వారికి ఏవైనా సమస్యలు వస్తే వారికి వారే పరిష్కరించుకుంటారు.. మరి చిన్న హీరోల పరిస్థితి ఏమిటి..ఇప్పటికైనా స్టార్ హీరోలు  తెలుసుకుని, హీరోలు కూడా ఈ మా పదవికి పోటీ చేస్తే బాగుంటుంది అని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాదు హీరోలు ఈ మా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తే హుందాగా  ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: