సినిమా పేర్లు సినిమా రేంజ్ ను డిసైడ్ చేస్తాయని చాలా మంది భావిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా మాస్ హీరోలకు మాస్ టైటిల్స్ పెట్టినట్లయితే అభిమానుల్లో మంచి క్రేజ్ ను తీసుకురావచ్చు అనే అభిప్రాయంలో సినిమా దర్శక నిర్మాతలు ఉంటారు. వేరు వేరు ప్రొడ్యూసర్లు , వేరు వేరు సినిమాల కోసం ఒక పేరును రిజిస్టర్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో కత్తి , ఖలేజా టైటిల్ విషయంలో సమస్య రావడంతో వీటికి ముందు హీరోల పేర్లు చేర్చి ఈ సినిమాలను విడుదల చేశారు.


ఇవన్నీ కూడా  ఎలాంటి వివాదాలు లేకుండా సున్నితంగా పరిష్కరించబడిన  విషయాలు . కానీ 1987 లో  ఎన్టీఆర్ , కృష్ణ మధ్య ఒక టైటిల్ విషయమై పెద్ద చర్చ నడిచింది. 1987 లో కె . రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్ గా 'సామ్రాట్' అనే పేరుతో ఒక సినిమాను రూపొందించారు . ఈ సినిమా విడుదలకు సంబంధించిన  పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు . అదే టైం లో  కృష్ణ తనయుడు అయిన రమేష్ బాబు ను హీరోగా పరిచయం చేస్తూ  డి. మధుసూదన్ రావు డైరెక్షన్ లో ఒక సినిమా రూపొందింది .


 దానికి కూడా 'సామ్రాట్' అనే పేరునే రిజిస్టర్ చేయించారు . దానితో ఈ టైటిల్ మాదంటే మాదని నిర్మాతలు రచ్చ చేయగా , ఎన్టీఆర్ , కృష్ణ ఎవరి సినిమాలకు వారు సపోర్ట్ గా నిలిచారు . ఈ చిన్న సమస్య చాలా పెద్దదిగా మారి మీడియా వరకు వెళ్ళింది . చివరగా బాలకృష్ణ టైటిల్ కు ముందు  సాహస అనే పదాలను చేర్చి 'సహస సామ్రాట్' గా విడుదల చేశారు . కృష్ణ తనయుడు రమేష్ బాబు సినిమా మాత్రం 'సామ్రాట్' అనే పేరుతోనే విడుదల చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: