సినిమా పరిశ్రమలో పనిచేసే ఇద్దరు ఆడ మగ మధ్య ప్రేమ పుట్టడానికి ఎంతో సమయం పట్టదు. పరిచయం అయ్యి మంచి స్నేహితులుగా ఉన్నవారు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం ఇప్పటి వరకు మనం చాలా మందిని చూశాము. ఎన్నో జంటలు ఆ విధంగా పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నారు. వెండితెర నటీనటులు మాత్రమే కాదు బుల్లితెర నటీనటులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని తమ జీవితాన్ని హ్యాపీ గా లీడ్ చేస్తున్నారు. ఆ విధంగా ఓ సీరియల్ జంట కూడా ప్రేమలో పడి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది.

ప్రఖ్యాత తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న మౌనరాగం సీరియల్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్తీకదీపం సీరియల్ తర్వాత అత్యధిక టిఆర్పి రేటింగ్ పొందుతున్న సీరియల్ మౌనరాగం. ఈ సీరియల్ లో హీరోయిన్ గా ప్రియాంక, హీరోగా శివకుమార్ నటిస్తున్నారు. ఈ సీరియల్ మాత్రమే కాకుండా ప్రియాంక జానకి కలగనలేదు, శివ ఇంటికి దీపం ఇల్లాలు అనే సీరియల్లో కూడా నటిస్తున్నారు. ఈ సీరియల్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇప్పుడు అది పెళ్ళికి దారితీస్తుంది.

 సీరియల్స్ చేసుకునే సమయంలో కాకుండా మిగతా ఖాళీ సమయాలలో రెస్టారెంట్స్ కు వెళ్లి తమ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలను ప్రేక్షకులకు షేర్ చేయడమే కాకుండా వీరిద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు కూడా చేసి తమ క్రేజ్ ను ఉపయోగించుకుంటున్నారు. వీరు చేసే వీడియోలను చూసిన ప్రతి ఒక్కరికి వీరు ప్రేమలో ఉన్నారు అన్న అనుమానం కలగక తప్పదు. దాంతో ప్రేక్షకులు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పట్లో పెళ్లి చేసుకోకపోయినా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనేది మాత్రం వీరి మధ్య ఉన్న అన్యోన్యతను చూస్తే అర్థమవుతుంది. మరి వీరి పెళ్లి విషయం ప్రేక్షకులకు ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: