ఈ సంవత్సరం హీరో నితిన్ జోరు మామూలుగా లేదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించిన 'చెక్'  సినిమాతో బాక్సాఫీసు పలకరించాడు. కాకపోతే ఈ సినిమా నితిన్ కు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది.  ఆ తర్వాత మార్చి నెలలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన 'రంగ్ దే' సినిమాతో మరోసారి నితిన్ తెలుగు ప్రేక్షకులను పలకరించి పర్వాలేదు అనిపించుకున్నాడు.

 ఇప్పటికే ఈ సంవత్సరం రెండు సినిమాలతో తెలుగు ప్రజలను పలకరించిన నితిన్, మరోసారి కూడా తెలుగు ప్రజలను పలకరించడానికి రెడీగా ఉన్నాడు. కాకపోతే ఈ సారి నితిన్ జనాలను థియేటర్లలో కాకుండా 'ఓటిటి' లలో పలకరించ పోతున్నాడు. నితిన్ హీరోగా తమన్నా, నభానటేష్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మాస్ట్రో' . నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకొని సెప్టెంబర్ 17వ తేదీన ప్రముఖ 'ఓటీటీ' అయిన  హాట్ స్టార్ లో టెలికాస్ట్ కావడానికి రెడీ గా ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ , కొన్ని పాటలు విడుదల కాగా వాటికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా నితిన్, కృష్ణాష్టమి సందర్భంగా 'మాస్ట్రో' సినిమాకు సంబంధించి స్నీక్ పీక్‌ అంటూ ఒక వీడియోను విడుదల చేశాడు. నితిన్ కెరీర్లో 30 వ సినిమా గా రాబోతున్న 'మాస్ట్రో' పై నితిన్ అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. నితిన్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా బిగ్ సక్సెస్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: