టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిర్మాత గా ఎదిగిన ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ సినిమాతో నిర్మాతగా మారిన రాజు దిల్ రాజు పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎదురు లేకుండా భారీ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. పెద్ద హీరోలు దిల్ రాజు తో తప్పకుండా ఓ సినిమా చేయాలని భావిస్తూ ఉంటారు. ఆయన దగ్గర దర్శకులకు కొదువ ఉండదు.. కథలకు కొరత ఉండదు. అందుకే దిల్ రాజును ఎక్కువగా సినిమాల విషయంలో నమ్ముతూ ఉంటారు మన హీరోలు.

ఇక ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య చూస్తే అందరూ ముక్కున వేలేసుకోక తప్పదు.  ఆయన ప్రస్తుతం అర డజను పాన్ ఇండియా మార్కెట్ సినిమాలను చేస్తూ ఉండగా దేశంలోని ఏ నిర్మాతకు సాధ్యం కాని విధంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాల పై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసి హిట్ లు ఇచ్చిన దిల్ రాజు ఇప్పుడు తెలివిగా తాను చేసిన హిట్ సినిమాలను బాలీవుడ్ లో తెరకెక్కించే పనిలో పడ్డారు. 

తాను నిర్మించిన సినిమాలను మాత్రమే కాకుండా ఇతర నిర్మాతలు నిర్మించిన సినిమాలను కూడా రైట్స్ తీసుకుని వాటిని బాలీవుడ్లో తెరకెక్కిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే రాజు నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ను బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా విశ్వక్ హీరోగా నటించిన హిట్ సినిమా ను రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన లాంచ్ కూడా జరిగింది. జెర్సీ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా దిల్ రాజు తెలివిగా తెలుగులో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో చేస్తూ అక్కడ కూడా టాప్ ప్రొడ్యూసర్ అయ్యే విధంగా ప్లాన్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: