సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు కథలు నచ్చక లేక సరైన కథను ఎంచుకునే కెపాసిటీ లేక మంచి మంచి సినిమాలను వదులుకుంటూ ఉంటారు.. కానీ కొంతమంది హీరోలు తాము చేస్తున్న ఇతర బిజినెస్ ల ద్వారా కూడా మంచి మంచి సినిమా ఆఫర్లను వదిలేసుకుంటూ , ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు.. అలాంటి వారిలో నాగార్జున కూడా ఒకరు. నాగార్జున ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న అప్పటికి ఈ మధ్య కాలంలో సినిమాలతో బోల్తా కొడుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే కేవలం సినిమా రంగమే కాకుండా టెలి రంగంతో పాటు రియల్ ఎస్టేట్ అలాగే మరికొన్ని బిజినెస్ లను నిర్వహిస్తూ వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ని రెండు చేతుల డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాడు.


ఇకపోతే అక్కినేని కొడుకుగా 1986 వ సంవత్సరంలో విక్రమ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఆ తర్వాత కెప్టెన్ నాగార్జున సినిమాలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు నాగార్జున. తర్వాత కలెక్టర్ గారి అబ్బాయి ,మజ్ను, గీతాంజలి, శివ లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుని ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు దాదాపుగా 85 చిత్రాలకు పైగా నటించాడు.

కొన్ని సంవత్సరాల కిందట రెండు చేతుల బాగా సంపాదిస్తున్న నేపథ్యంలో, కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరం కావాలని సినిమాలను పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ రంగం వైపు అడుగులు వేశాడు నాగార్జున. అప్పుడు నాగార్జున నటించిన సినిమా ఒకటి డిజాస్టర్ కావడంతో ,కొంత కాలం సినిమాలకు దూరం కావాలని రియల్ ఎస్టేట్ పనులు చూసుకోవడం మొదలు పెట్టాడు. నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా కొన్ని పనులు ఉండడంతో మంచి మంచి సినిమా ఆఫర్లు వచ్చినప్పటికి, నాగార్జున వాటిని వదులుకొని తన సినీ కెరీర్ ను అప్పుడు కొంచెం డౌన్ చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: