మనసుకు ఆనందం కలిగినా, బాధ కలిగినా చాలా మంది సంగీతం వింటూ ఉంటారు. మన మూడ్ ఎలా ఉన్నా ఒక మంచి పాట వింటే చాలు వెంటనే మనసు సంతోషంలో మునిగిపోతుంది. అంతగా సంగీతం మనల్ని మైమరిపిస్తుంది. సినిమాలు విజయం సాధించడంలోనూ పాటలు ముఖ్య భూమికను పోషిస్తుంటాయి. కొన్నిసార్లు సినిమాలు హిట్ అవ్వకపొయినా ఆ చిత్రంలోని పాటలు మాత్రం సూపర్ హిట్ అందుకుంటుంటాయి. అలాంటి పాటలకు తమ తియ్యటి స్వరాన్ని అందించి అద్భుతంగా పాడి ఎన్నో మంచి పాటలను మనకందించారు ఎందరో గాయనీగాయకులు. హీరో, హీరోయిన్ల గురించే కాదు స్టార్ సింగర్స్ గురించి కూడా తెలుసుకోవాలని చాలామంది అనుకుంటుంటారు.

వీరు ఒక్కో పాటకు ఎంత తీసుకుంటారు. లేదా సినిమాకు ఇంతని మాట్లాడుకుంటారా అంటూ ఎన్నో సందేహాలు ఉంటాయి. అయితే ఇపుడు టాలీవుడ్ లో ఉన్న కొందరు ప్రముఖ గాయనీ గాయకుల పారితోషికం గురించి తెలుసుకుందాం.    

దివంగత గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఒక్కోసారి ఒక పాటకు లక్షరూపాయలు వరకు తీసుకునే వారట. సీనియర్ సింగర్ చిత్ర కూడా లక్షరూపాయలు వరకు తీసుకుంటారట. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ అయినటువంటి చిన్మయి కూడా ఒక్కో పాటకు లక్ష వరకు తీసుకుంటారని తెలుస్తోంది. సీనియర్ సింగర్ సునీత 75 వేల వరకు తీసుకుంటారని సమాచారం. ఇదే తరహాలో రమ్య బెహ్ర 35,000 , గాయని కౌసల్య 45,000,  హేమ చంద్ర 40,000, గీత మాధురి 45,000, మాళవిక 25000, శ్రావణ భార్గవి 50,000,శ్రీ కృష్ణ 25,000, అంజన సౌమ్య 35,000 వరకు తీసుకుంటారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

అయితే వీరికి అందే ఈ పారితోషికాలు పూర్తిగా ఆ పాటల మీదనే ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అయితే ఇప్పుడు అయితే గుంపులుగుంపులుగా సింగర్స్ ఉన్నారు కాబట్టి అంతంత పారితోషికం ఉండే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: