యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ 'బాహుబలి' హిట్‌తో పాన్ ఇండియన్ స్టార్‌ అయ్యాడు. వెయ్యి కోట్ల హీరో అనే ట్యాగ్‌తో బాలీవుడ్‌ మేకర్స్‌కి కూడా బెస్ట్‌ ఆప్షన్‌గా మారిపోయాడు. కానీ ప్రభాస్‌తో సినిమాలు తీస్తోన్న తెలుగు డైరెక్టర్స్‌కి మాత్రం బ్రేకులు పడుతున్నాయి. 'బాహుబలి-2' తర్వాత ప్రభాస్‌ సుజిత్‌ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేశాడు. ఈ మూవీతో సుజిత్‌ రేంజ్‌ మారుతుందని అంతా అనుకున్నారు. కానీ సుజిత్‌ మాత్రం 'సాహో' తర్వాత మరో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించలేదు.

సుజిత్ 'రన్‌ రాజా రన్'తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్‌ మూవీతోనే ప్రభాస్‌ని డైరెక్ట్‌ చేశాడు. ఇక 'సాహో' టైమ్‌లో సుజిత్‌ కెరీర్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్తుందనే టాక్ వచ్చింది. కానీ  'బాహుబలి' ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లిన ఆడియన్స్‌ని 'సాహో' సంతృప్తి పరచలేకపోయింది. దీనికితోడు ప్రభాస్‌ ఇమేజ్‌ని సుజిత్‌ హ్యాండిల్ చేయలేకపోయాడనే నెగటివ్ కామెంట్స్‌ వచ్చాయి.

'సాహో' తర్వాత సుజిత్‌కి చిరంజీవిని డైరెక్ట్‌ చేసే ఛాన్స్ వచ్చింది. మళయాళీ హిట్‌ 'లూసిఫర్' రీమేక్ బాధ్యతలు అప్పగించాడు చిరు. సుజిత్‌ వర్క్ కూడా మొదలుపెట్టాడు. అయితే మధ్యలో ఏమైందో ఏమో ఈ సినిమా నుంచి సుజిత్‌ బయటకెళ్లాడు. అయితే ఈ మెగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక సుజిత్‌ మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ప్రభాస్ 'సాహో' తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' సినిమా చేశాడు. 'జిల్'తో మెగాఫోన్ పట్టిన రాధాక్రిష్ణ సేమ్‌ టు సేమ్‌ సుజిత్‌లాగే సెకండ్‌ సినిమాకే ప్రభాస్‌ని డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ సెట్స్‌కి వెళ్లినప్పటి నుంచి లాక్‌డౌన్లు, కరోనా అంటూ షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. ఎలాగోలా రెండు వేవ్స్‌ని తట్టుకుని షూటింగ్‌ పూర్తి చేసుకుంటే, ఇప్పుడు విడుదల సమయానికి థర్డ్‌ వేవ్‌ వచ్చిపడింది.

'రాధేశ్యామ్' పాన్‌ ఇండియన్ మూవీగా రిలీజ్ అవుతోంది. దీంతో రాధాక్రిష్ణకుమార్‌కి హిందీలో కూడా మైలేజ్‌ వస్తుందనే టాక్ వచ్చింది. కానీ రాధాక్రిష్ణ కుమార్ మాత్రం 'ఒమిక్రాన్‌'తో ఆగిపోయిన 'రాధేశ్యామ్' దగ్గరే స్ట్రక్ అయ్యాడనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అందుకే ఈ దర్శకుడి నెక్ట్స్‌ మూవీ ఏంటన్నది ఇండస్ట్రీ జనాలకు కూడా తెలియట్లేదు అంటున్నారు. మరి రాధాకృష్ణ నెక్ట్స్‌ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: