రవితేజ హీరోగా నటించిన ఖిలాడి చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు రాగా అందరూ ఊహించినట్లుగానే ఈ చిత్రం భారీ ఫ్లాప్ అయ్యింది. మొదటి నుంచి ఈ సినిమా పై రవితేజ పెద్ద గా ఇంట్రెస్ట్ లేనట్లు గానే వ్యవహరించాడు. ఆయనకు దర్శకుడితో ఏదో గొడవ అయిందని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో వారి మధ్య సఖ్యత లేదని ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో నిర్ధారణ అయింది. అయితే సినిమా విడుదల తర్వాత ఫలితం బాగా ఉంటుందని కొంతమంది ఆశించగా తొలిరోజు వసూలు ఊహించనంత రాలేదు.

రెండోరోజు పరిస్థితుల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. దాంతో ఈ సినిమా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కనీసం వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టు కోలేక పోయింది.  రెండు కోట్ల షేర్ కూడా వసూలు చేసుకోలేకపోయినా డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. క్రాక్ సినిమా తొలి ఆట ఓపెనింగ్స్ కలెక్షన్స్ కూడా తొలిరోజు ఓపెనింగ్స్ కు రాక పోవడం నిజంగా రవితేజ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. చాలా చోట్ల ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి అయితే అదిరిపోయే కలెక్షన్లు మాత్రం రాలేదు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా స్క్రీన్ ప్లే స్లోగా ఉండటమే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అయ్యింది. మరి ఈ వారంలో ఈ సినిమా కలెక్షన్ల లో ఏమైనా తేడా చూపిస్తాయా అనేది చూడాలి. మీనాక్షి చౌదరి, డింపుల్ హాయాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల బిజినెస్ జరిగింది ఈ సినిమాకు. ఇకపోతే రవితేజ ఈ చిత్రం తర్వాత మరొక మూడు సినిమాలను ఓకే చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా సినిమాల షూటింగ్ లలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ చిత్రాలను కూడా ఇదే సంవత్సరం విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర సినిమా ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు రవితేజ

మరింత సమాచారం తెలుసుకోండి: