కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేశ్‌ బాబు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి, సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. పాన్‌ ఇండియన్‌ మూవీస్‌ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కృష్ణ కూతురు మంజుల కూడా సినిమాల్లోకి వచ్చింది. 'షో' సినిమాలో లీడ్‌ రోల్ ప్లే చేసిన మంజుల ఆ తర్వాత సపోర్టింగ్‌ రోల్స్‌లోకి వెళ్లింది. దర్శకనిర్మాతగానూ రాణిస్తోంది. కృష్ణ చిన్న అల్లుడు సుధీర్‌ బాబు కూడా సినిమాల్లోకి వచ్చాడు. 'ఎస్.ఎమ్.ఎస్.' సినిమాతో హీరోగా లాంచ్ అయిన సుధీర్, ఇంకా నంబర్‌ రేసులో అడుగుపెట్టలేదు గానీ, సొంత మార్క్‌ మాత్రం క్రియేట్ చేశాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా నటించాడు. ఈ ఏడాదే హీరోగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అలాగే సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. కృష్ణ మనవడు, మహేశ్‌ బాబు మేనల్లుడు, రాజకీయనాయకుడు గల్లా జయదేవ్ కొడుకు గల్లా ఆశోక్‌ హీరోగా లాంచ్ అయ్యాడు. సొంత బ్యానర్‌ అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో 'హీరో' సినిమాతో వెండితెర మీదకి వచ్చాడు అశోక్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా సందడి చేయలేకపోయింది.

మెగాఫ్యామలీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి డెడికేట్ అయ్యారని ఇండస్ట్రీ జనాలు చెప్తుంటారు. కొంతమంది నెటిజన్లు మెగాఫ్యామిలీ వారసత్వాన్ని పెంచి పోషిస్తుందని కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా చిరంజీవి ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. చిరంజీవి వారసత్వంలో తమ్ముళ్లు, తమ్ముడి కొడుకులతో పాటు మేనల్లుళ్లు, అల్లుళ్లు కూడా హీరోలుగా వచ్చారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలున్నారు. తమ్ముడు పవన్‌ నంబర్‌ గేమ్‌లో దూకుడు చూపిస్తోంటే, కొడుకు రామ్‌ చరణ్ పాన్ ఇండియన్ మార్కెట్‌ని ఫోకస్ చేశాడు. పెద్ద తమ్ముడు నాగబాబు కొడుకు వరుణ్‌ తేజ్‌ కూడా హీరోగా రాణిస్తున్నాడు. వీళ్లతో పాటు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ కూడా సినిమాల్లోకి వచ్చాడు. పెళ్లికి ముందు కళ్యాణ్‌ దేవ్ సినిమాల్లో నటించలేదు. శ్రీజని పెళ్లి చేసుకున్నాక వెండితెరపైకి వచ్చాడు కళ్యాణ్‌ దేవ్.

చిరంజీవి మేనల్లుళ్లు సాయి ధరమ్‌ తేజ్, వైష్ణవ్ తేజ్‌ కూడా సినిమాల్లోకి వచ్చారు. సాయి తేజ్‌ 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి లుక్స్‌తో ఉన్న తేజ్‌ పెర్ఫామెన్స్‌కి మెగాఫ్యాన్స్‌ త్వరగానే కనెక్ట్‌ అయ్యారు. చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ కూడా పోయినేడాదే సినిమాల్లోకి వచ్చాడు. 'ఉప్పెన' సినిమాతో వైష్ణవ్‌ తేజ్ హీరోగా లాంచ్ అయ్యాడు. ఇక ఈ మూవీ సూపర్ హిట్‌ కావడంతో వైష్ణవ్‌కి ఫస్ట్‌ మూవీతోనే క్రేజీ ఇమేజ్ వచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో హంగామా చేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: