సినీ ఇండస్ట్రీకి, క్రికెట్ కి మంచి అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రికెటర్లు కూడా ఎంతో సన్నిహితంగా సంబంధాలను కొనసాగిస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఎంతోమంది హీరోయిన్స్ సైతం క్రికెటర్లను ప్రేమించి వివాహం చేసుకున్నారు.. విరాట్ కోహ్లీ మొదలుకొని ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని వివాహం చేసుకున్నారు. మరికొంతమంది ప్రేమించినప్పటికీ పెళ్లి పీటల వరకు వెళ్లలేకపోయారు. ఇక అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా క్రికెటర్లకు , సినీ తారలకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ తెగ వార్తలు వినిపిస్తుంటాయి..


ఇక ఈ వార్తల విషయం కనుక పక్కన పెడితే.. రెగ్యులర్ గా ఏదో ఒక లవ్ స్టోరీ కొనసాగుతూనే ఉంటుంది.  ఇక ఈ నేపథ్యంలోనే సినీ - క్రికెట్ మధ్య  ప్రేమ వ్యవహారం మొదలైనట్లుగా తాజా పరిస్థితులను గమనిస్తే తెలుస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు కూడా చేస్తున్నారు.. ఇకపోతే అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా నటించిన తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.. వర్తమాన క్రికెటర్ అయిన వెంకటేష్ అయ్యర్  తో ప్రేమలో ఉంది అనే వార్తలు బాగా రోజురోజుకు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రియాంక జవాల్కర్ కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో హాట్ అండ్ క్యూట్ ఫోటోషూట్ షేర్ చేయడం జరిగింది.
ప్రియాంక జవాల్కర్ రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.  కానీ తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలకు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ కామెంట్ చేయడంతో ఇది కాస్త బాగా ఆసక్తి గా మారిపోయింది . ఇకపోతే వీరిద్దరి మధ్య ఏదైనా ప్రేమ చిగురించిందా..ఏ క్షణంలోనైనా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు  అని ప్రకటిస్తారా..? అంటూ సినీ ప్రేక్షకులతో పాటు మీడియా వర్గాలు కూడా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ప్రియాంక జవాల్కర్ ఫోటో కింద క్యూట్ అని వెంకటేష్ కామెంట్ పెట్టడంతో ఆమె కూడా విభిన్నంగా స్పందించింది..అంతే కాదు మీరు ఎవరు అన్నట్లుగా కామెంట్ పెట్టడం తో ఎవరో తెలియకుండానే నువ్వు వెంకటేష్ ని ఫాలో అవుతున్నావా అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: