మాస్ మహరాజ రవితేజ వరుస సినిమాలను చేస్తూ వస్తున్నారు.. ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నారు.. రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ అయ్యింది..అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జరిగింది.


ఆ  ఈవెంట్ కి ముఖ్య అతిధిగా న్యాచురల్ స్టార్ నాని వచ్చారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ”రవి అన్న కోసం మాట్లాడే అవకాశం వచ్చిందని ఇక్కడకి వచ్చాను. రవి అన్నకి చిరంజీవి గారు అంటే ఇష్టం, రవి అన్న కెరీర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్లకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. నాకు నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు రవితేజ అన్న ఇన్స్పిరేషన్. ప్రతి జనరేషన్ కి ఇలా ఒకడు ఉంటాడు. ఈ జనరేషన్ కి రవి అన్న అలాంటోడు. చిరంజీవి సినిమాలో రవితేజ చేస్తున్నట్టు మేము కూడా రవి అన్నతో చేయాలి. నాకు రవి అన్నతో సినిమా చేయాలని ఉంది. ఒక మంచి సినిమా చూసినప్పుడు ఆ టీమ్ ను అభినందించడం ఒక బాధ్యత గా ఫీల్ అవుతారు రవి అన్న అని పొగుడుతూ తన మనసులోని మాటలను బయటకు చెప్పేశాడు..


రామారావు అన్ డ్యూటీ సినిమా పై ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. నా దసరా సినిమా నిర్మాతలే ఈ సినిమాని నిర్మించారు. బాక్సాఫీస్ కి సినిమానే కాదు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందించాలని మా నిర్మాతల తాపత్రయం. వేణు గారి సెకెండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉండాలి. రామారావు అన్ డ్యూటీ టీమ్ అందరికీ అల్ ది బెస్ట్. 20 సంవత్సరాల నుంచి రవితేజ అన్ డ్యూటీ 29 నుంచి రామారావు అన్ డ్యూటీ” అని తెలిపారు. ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్లు నాని, రవితేజ ఒకేసారి స్టేజిపై కనపడటంతో అభిమానులు, ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేవు...ఫుల్ మాస్ యాక్షన్ కథతో అన్న తన మార్క్ ను చూపించనున్నారు..ఈ సినిమా సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాము..మళ్ళీ అన్న బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలను అందిస్తారని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపాడు.. నాని స్పీచ్ ఈవెంట్ కు హైలెట్ అయ్యింది..మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: