తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరో లలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇప్పటికే ఈ హీరో ఈ సంవత్సరం సేభాష్టియన్ మరియు సమ్మతమే మూవీ లతో ప్రేక్షకులు పలకరించాడు. ఈ మూవీ లలో సెభాష్టియన్ మూవీ ప్రేక్షకులను నిరాశపర్చగా , సమ్మతమే మూవీ పర్వాలేదు అనే విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ హీరో ఈ సంవత్సరం మూడో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. తాజాగా ఈ హీరో నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. కోడి దివ్య నిర్మించిన ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహించాడు.

సంజన ఆనంద్ ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్ గా నటించిగా , ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు.  ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 14 వ తేదీన ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జే ఆర్ సి కన్వెన్షన్స్ , హైదరాబాద్ లో సెప్టెంబర్ 14 వ తేదీన సాయంత్రం 6 గంటలకు నిర్వహించనుంది. ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: