బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ 'బ్రహ్మాస్త్ర'.
పాన్ ఇండియా మూవీగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర'… హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ చిత్రం 'బ్రహ్మాస్త్రం'( మొదటి భాగం శివ) పేరుతో రిలీజ్ అవ్వగా ….

స్టార్ స్టూడియోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌, ప్రైమ్ ఫోకస్‌, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగులో రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తుండడం.. నాగార్జున కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించడం,చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ చిత్రం. అంతేకాకుండా నిన్న 5 వ రోజు కూడా ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం    4.96 cr
సీడెడ్    1.12 cr
ఉత్తరాంధ్ర    1.09 cr
ఈస్ట్    0.74 cr
వెస్ట్    0.49 cr
గుంటూరు    0.85 cr
కృష్ణా    0.46 cr
నెల్లూరు    0.34 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)    10.05 cr
'బ్రహ్మాస్త్రం' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు మరియు హిందీ వెర్షన్లతో కలుపుకుని రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.2 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.10.05 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం బయ్యర్స్ కు రూ.5.25 కోట్ల లాభాలను అందించింది. మొదటిరోజు సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. రిలీజ్ కు ముందు ఏర్పడిన హైప్ కారణంగా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగా కలెక్ట్ చేస్తుంది
బాలీవుడ్ బ్రహ్మాస్త్ర వసూళ్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సినిమాకు రివ్యూ లు నెగటివ్ గా వచ్చాయి. ప్రేక్షకుల స్పందన కూడా నెగిటివ్ గానే ఉంది అయినా వసూళ్లు మాత్రం వందల కోట్లు నమోదు అవుతుండడం ఆశ్చర్యకరంగా ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు లో రాజమౌళి సమర్పించాడు కనుక బ్రేక్ ఈవెన్‌ సాధ్యం.. కానీ ఇతర భాషల్లో ఈ సినిమా ఎలా బ్రేక్ ఈవెన్ కి దూసుకెళ్తుంది అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదైనా ఒక పదార్థం గురించి.. లేదంటే విషయం గురించి ఎవరికీ అంతు చిక్కకపోతే దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ కూడా ఒక బ్రహ్మ పదార్థం అయినట్లుగా మారి పోయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. నిజంగానే బ్రహ్మాస్త్ర సినిమా ఈ స్థాయి వస్తువులను నమోదు చేస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కానీ సాక్షాదారాలతో సహా మీడియాకు చెందిన వారు ఈ కలెక్షన్స్ ని వెల్లడిస్తుండడంతో చిత్ర యూనిట్ సభ్యులకి కలెక్షన్స్ కి ని ప్రకటించడం లేదు. కనుక నిజమైన కలెక్షన్స్ అయ్యి ఉంటాయి అని కొందరు మీడియా వర్గాల వారు నమ్ముతున్నారు. ఈ సినిమా బాగాలేదు అనుకుంటనే ఒక భారీ సినిమా కనుక చూద్దాం ఎలా ఉందో.. అలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు ఎలా చేశారో ఒక సారి చూద్దాం అన్నట్లుగా ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. వచ్చే వీకెండ్ కూడా భారీ వసూలు నమోదయ్యే అవకాశముంది. దాంతో ఈ సినిమా 300 కోట్ల మార్క్ చేరే అవకాశం ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే కచ్చితంగా ఈ సినిమా ఒక అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అమెరికాలో కేజిఎఫ్ 2 యొక్క వసూళ్లను బ్రహ్మాస్త్ర క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఇండియాలో కూడా అదే స్థాయిలో వస్తువులని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: