శ్రీరెడ్డి రెడీ అవుతోందట. మరోసారి దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ ఇంటెలిజెంట్స్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న అభిరామ్ పై మాటల తూటాలు రెడీ చేసుకుంటుందట...?

 
టాలీవుడ్ లో పెద్ద సినిమా ఫ్యామిలీస్ లో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇప్పటికే సురేష్ బాబు పెద్ద కొడకు రానా హీరోగా స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి మరో హీరో తేరంగేట్రం జరగబోతోంది. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

 
ఎంతో మంతి కొత్త తారలను స్టార్లు గా మార్చిన డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ ఫస్ట్ మూవీ తెరకెక్కుతుంది. అహింసా టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ -సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన అహింస ఫ్రీ లుక్ పోస్టర్‌తో తో పాటు ఫస్ట్ గ్లింప్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈసినిమాపై ఓ భయం కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.

 
అయితే అభిరామ్ తొలి సినిమాకు కష్టాలు తప్పేట్టు లేవు. ఇప్పటికే టాలీవుడ్ లో కొంతముంది నుంచి భారీ ఎత్తున నెగెటివ్ గా ఉన్నారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రచారం గట్టిగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక అభిరామ్‌ను కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈసారి కూడా అభి తేరంగేట్రాన్ని టార్గెట్ చేస్తూ.. గట్టిగా అనేయడానికి ప్రిపేర్ అవుతోందట.

 
ఇంతకు మందు అభిరామ్ విషయంలో రచ్చ రచ్చ చేసింది శ్రీరెడ్డి. అభిరామ్ తనను అవకాశాల పేరుతో లైంగీకంగా వాడుకున్నాడని.. తనపై చాలాసార్లు అత్యాచారం చేశాడని. తనను చాలా మభ్యపెట్టి మోసం చేశాడని పలు ఆరోపణలు కూడా చేసింది. వాళ్ళ స్టూడియోలోనే తనపై చాలాసార్లు అత్యాచారం చేశాడని కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసి సంచలనం చేసింది.

 
అంతే కాదు దగ్గుబాటివారినందరిని శ్రీరెడ్డి టార్గెట్ చేసింది. వెంకటేష్‌, సురేష్‌బాబును మామలు అంటూ సెటైర్లు వేసింది. రానా పెళ్ళి సందర్భంగా కూడా బావగారు అంటూ ...ఘాటు గా మాట్లాడేసింది. అంతే కాదు వీలు కుదిరినప్పుడల్లా అభిరామ్‌ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఏం చేస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 
ఇక అభిరామ్ ఫస్ట్ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సినిమాతో పాటు మనోడిని రకరకాలుగా టార్గెట్ చేసేందుకు రెడీగా ఉందనే ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: