తాజాగా అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ ప్రధాన పాత్రలలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి సినిమా ది ఘోస్ట్.ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ

 ప్రస్తుత కాలంలో హీరోయిన్లు యాక్షన్ సీక్వెన్స్ సినిమాలలో కూడా నటించడానికి సిద్ధంగా ఉండాలని ఈయన తెలిపారు.ఇక ప్రస్తుతం యాక్షన్ సినిమాలకు డిమాండ్ పెరగడంతో ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. అయితే ఇక  ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ సినిమాలలో నటించడానికి హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా ఉందని ఈయన తెలిపారు.ఇకపోతే  ఈ క్రమంలోనే ఘోస్ట్ సినిమా కోసం ఎంతో మంది హీరోయిన్లను సంప్రదించామని అయితే ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలలో నటించడానికి హీరోయిన్లు దొరకలేదని తెలిపారు.

ఇక ముందుగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఎంపిక చేసాము. అయితే ఇక  కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. కాగా కాజల్సినిమా నుంచి తప్పుకోవడంతో హీరోయిన్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఈయన తెలిపారు.అయితే  కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈమె తర్వాత ఈ సినిమాలో నటించిన అమలాపాల్, శృతిహాసన్, జాక్వలిన్ ఫెర్నాండిస్ వంటి హీరోయిన్లను సంప్రదించినప్పటికీ వీరంతా వారి సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తమ సినిమాకి నో చెప్పారంటూ ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.ఇక ఇలా ఎంతో మంది హీరోయిన్లను సంప్రదించిన తర్వాత చివరికి సోనాల్ చౌహాన్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ప్రవీణ్ సత్తార్ హీరోయిన్ల గురించి వెల్లడించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: