కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి  ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ సినిమా అని చెప్పాలి. తమిళ హీరో తమిళ దర్శకుడు తమిళ నటి నటులు అయినప్పటికీ ఇక అన్ని భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ సాధించినది. ఊహించని రీతిలో నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించి ఒక ప్రత్యేకమైన మార్క్ సెట్ చేసింది అని చెప్పాలి.


 ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాలో అటు యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. యాక్షన్స్ సీక్వెన్స్  అంటే ఇలాగే ఉండాలి అని ప్రేక్షకులు అనుకునేంతలా కేజిఎఫ్ అందరిని సాటిస్ ఫై చేసింది. ఇక మొన్నటికి మొన్న వచ్చిన విక్రమ్ సినిమా కూడా ఇలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఇక ఇప్పుడు నాగార్జున హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా కూడా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టేసింది అని అంటున్నారు ప్రేక్షకులు.  ఏకంగా కే జి ఎఫ్ సినిమాలో తరహాలోనే ఘోస్ట్ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అని అంటున్నారు.


 ఏదేమైనా గత కొంతకాలం నుంచి సరైన హిట్ లేక నాగార్జున ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఘోస్ట్ సినిమాతో మాత్రం మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు అన్నది తెలుస్తుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది  అన్న విషయం తెలిసిందే. ఇక నాగార్జున సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ నటించింది. అయితే సోనాల్ చౌహాన్ కి ఘోస్ట్ సినిమాలోని పాత్ర ది బెస్ట్ రోల్ అంటూ అభిమానులు కూడా చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: