గరికపాటి వర్సెస్ చిరంజీవి... ఇప్పుడు ఎక్కడ చూసినా వీరిద్దరి గురించి చర్చ సాగుతోంది. సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది.
గరికపాటి వ్యాఖ్యలు చేయకుండా ఉండి ఉంటే బాగుండు అనేదే ఎక్కువ మంది కోరుకుంటున్నా మాట అయితే చిరంజీవి గురించి తెలియక అన్న మాటలు కాదు కానీ చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిరంజీవితో సెల్ఫీ తీసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు 40 సంవత్సరాల కష్టం, వినయం, ప్రొఫెషనలిజం, క్రమశిక్షణ, సేవా గుణం, మంచితనం, మానవత్వం, మనిషితనం, నేత్రదానం, రక్తదానం, ఆక్సిజన్ సిలిండర్స్, చారిటీ, సేవాగుణం ఇలా ప్రతి ఒక్కటి నిండిన ఆయన ఒక ఉద్యమ దీప్తి.
విపరీతమైన గౌరవం మర్యాదలు ఉంటాయి చిరంజీవికి. ఆయన ఒక మహా వృక్షం అయినప్పటికీ ప్రతి చెట్టు నీ ప్రేమిస్తారు. మంచి మనిషి అయినప్పటికీ ఆయన అక్షరానికి దాసోహం అవుతాడు. నిరంతర విద్యార్థిగా ఉండాలంటూ పెద్దలకి అమితమైన గౌరవాన్ని ఇస్తారు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయన ఒక దయార్ధ హృదయుడు, సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కష్టాలు పడుతున్న పేద నటులకు సహాయం చేసిన గొప్ప వ్యక్తి. ఆయన తన ముందు పుస్తకం లేదా పేపర్ కింద పడితే తీసి పైన పెడతారు. ఎవరు ఏం రాసిన, ఎవరు బాగా నటించినా, ఎవరు మంచి పని చేసిన ఆయనే స్వయంగా ఫోన్ చేసి మరియు మాట్లాడుతారు.సల్మాన్ ఖాన్, అమితాబచ్చన్ లాంటివారు ఫ్రీగా అన్నయ్యతో యాక్టింగ్ చేస్తున్నారంటే అదేమీ చిన్న విషయం కాదు కదా. తన తోటి నటుడు చనిపోతున్నాడు అంటే ఖచ్చితంగా వెళ్లి పలకరించి వస్తాడు. లేదంటే వీడియో కాల్ అయినా చేసి ధైర్యం చెబుతారు. అంతటి మహానుభావుడు మన చిరంజీవి. ఆయన పెద్దవారికి ఇచ్చే మర్యాదలు ఎలాంటివో ఒక చిన్న సంఘటన కూడా చూద్దాం. ఓసారి అక్కినేని నాగేశ్వరరావు, కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి వీరందరూ ఉన్న ఒక పత్రిక ముఖచిత్రంపై ఆటోగ్రాఫ్ ఉన్న ఫోటోలను ప్రచురించాలని సదరు పత్రికా కంపెనీ అనుకుంది.
దాంతో అందరూ బ్లాక్ డ్రెస్సెస్ వేసుకున్న ఫోటోలని తీయించుకొని మరి పత్రికకు ఇచ్చారు. దాంతో ఆ పుస్తకంపై సంతకం చేయడానికి చిరంజీవికి సరిపడా ప్లేస్ దొరకలేదు కేవలం అక్కినేని మాత్రమే వైట్ లాల్చీ వేసుకుని ఉన్నారు. పక్కనే ఉన్న వ్యక్తి అక్కినేని ఫోటో పై సంతకం చేయండి ఏం పరవాలేదు అని అన్నారట. కానీ అక్కినేని వంటి మహానీయుడు ఫోటో పై సంతకం చేసేంత గొప్పగా నేను ఎదగలేదు అంటూ దొరికిన చోట చిన్నగా సంతకం చేసి వదిలేసారట. అది ఆయనకు ఉన్న వినయం. ఓసారి దర్శకుడు విశ్వనాథ్ కి సన్మానం జరుగుతుంటే వెళ్లి ఆయన కాళ్ల దగ్గర కూర్చున్నారు చిరంజీవి.అలాంటి మహానుభావుడికి ఇలాంటి అవమానం అతి మంచితనానికి పోవడం వల్లే జరిగింది అని కొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: