సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీ లలో ఒక్కడు మూవీ ఒకటి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భూమిక చావ్లా హీరోయిన్ గా నటించగా ,  ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ 2003 వ సంవత్సరం జనవరి 15 వ తేదీన భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. 

దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. అప్పట్లో ఒకడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఇలా మహేష్ బాబు కెరియర్ లి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఒక్కడు మూవీ వచ్చే సంవత్సరం జనవరి 15 వ తేదీతో 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ మూవీ ని మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఒక్కడు మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 7 తేదీన థియేటర్ లలో రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలచిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: