టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా డైరెక్టర్గా కూడా మంచి గుర్తింపును పొందాడు ఈయన. ప్రస్తుతం ఈయన చేతినిండా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం ఈయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప రెండవ భాగం షూటింగ్ కి సంబంధించిన పనిలో బిజీగా ఉన్నాడు .అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 

దాదాపు 10 ఏళ్లపాటు బిజీగా ఉండబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.  అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2  సినిమా షూటింగ్ పనులు పూర్తికావడానికి దాదాపు ఇంకొక సంవత్సరం పడుతుంది. దాని అనంతరం ప్రభాస్ తో సుకుమార్ ఒక సినిమా చేయాలని గట్టిగా అనుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రభాస్ తో చేయబోయే ఆ సినిమా కోసం సుకుమార్ కి కనీసం రెండేళ్ల సమయం అయినా పడుతుంది అని తెలుస్తోంది. దాని అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట సుకుమార్. రామ్ చరణ్  మరియు ఈయన కాంబినేషన్లో

వచ్చిన రంగస్థలం సినిమా తరువాత వీరి కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని చర్చలు కూడా జరిగాయి అన్నట్లుగా వార్తలు కూడా రావడం జరిగింది. ప్రభాస్ తో సుకుమార్ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ తో సినిమాను మొదలుపెట్టనున్నాడు సుకుమార్. ఈ రెండు సినిమాల అనంతరం సుకుమార్ పుష్ప 3 కూడా చేసే ప్లాన్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ వార్త విన్న చాలామంది వీరి అభిమానులు ఒక్కో సినిమా ఏడాదిన్నర గ్యాప్ లో పూర్తిచేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: