ఫీల్ గుడ్ సినిమా అందాల రాక్షసి అనే విభిన్నమైన సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా తనను తాను ప్రత్యేకంగా ఆవిష్కరించుకున్న దర్శకుడు హను రాఘవపూడి. ఈయన దర్శకత్వం లో ప్రస్తుతం రూపొందుతున్న సినిమా ఏంటి అంటే ఎవరి వద్ద సమాధానం అయితే లేదు.

గత ఏడాది ఈయన దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా సీతారామం అనే సినిమా ను ఆయన తెరకెక్కించాడు. ఆ సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టిన సీతారామం సినిమా తర్వాత హను రాఘవపూడి ఇప్పటి వరకు కొత్త సినిమా ను అయితే మొదలు పెట్టలేదు. అసలు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అనే దానిలో క్లారిటీ లేదు. ఒకరు ఇద్దరికీ ఇప్పటికే కథలు చెప్పాడని వార్తలు కూడా వస్తున్నాయి. 100 కోట్ల దర్శకుడుని ఆ హీరోలు ఎందుకు అస్సలు పట్టించుకోవడం లేదు అర్థం కావడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఒక హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాప్స్ అన్నట్లుగా హను రాఘవపూడి కెరియర్ అయితే సాగుతోంది. అందుకే ఆయన ను హీరోలు నమ్మడం లేదా అనే అనుమానాలు కూడా చాలానే వ్యక్తమవుతున్నాయి. మంచి కథ తో వెళ్తే ఏ దర్శకుడినైనా యంగ్ హీరోలు సపోర్ట్ చేస్తారు అనడం లో సందేహం అయితే లేదు. 100 కోట్ల సినిమా తీసిన హను రాఘవపూడిని జనాలు కచ్చితంగా అయితే ఆదరిస్తారు.. అభిమానిస్తారు. అందుకే మరో సారి ఆయన ఒక మంచి అద్భుతమైన ప్రేమ దృశ్యకావ్యం ను తీసుకు రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. యంగ్ హీరోల్లో చాలా మంది టాలెంటెడ్ హీరోలు కూడా ఉన్నారు. వారిని ఉపయోగించుకుని మరో సీతారామం రేంజ్ కమర్షియల్ లవ్ స్టోరీ ని తెరకెక్కించాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇలా సైలెంట్ గా ఉంటే ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: